- మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఫైర్
ఎల్లారెడ్డిపేట, వెలుగు: తెలంగాణలోని పలు ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదిండం దుర్మార్గమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మాజీ జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను పరామర్శించిన వినోద్అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈనెల 18న హైదరాబాద్లో జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జీఆర్ఎంబీ సమావేశ ఎజెండా నుంచి తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల రద్దు అంశాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
