జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ డెయిరీ పాల కేంద్రంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. కేంద్రంలోని దాదాపు 600 ఐస్‌క్రీమ్‌లలో తీవ్ర నాణ్యతా లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఫ్రిడ్జ్‌లో తగినంత కూలింగ్ ఉన్నప్పటికీ ఐస్‌క్రీమ్‌లు కరిగిపోతుండటంతో పాటు స్వల్పంగా దుర్వాసన వస్తుండడాన్ని గమనించారు. దీంతో ఆ ఐస్‌క్రీమ్‌లను విక్రయించకుండా వెంటనే తొలగించి డిస్కార్డ్ చేశారు.
