బెల్లంపల్లి రూరల్: కోడి పందాలు ఆడుతున్న 16 మంది అరెస్ట్

బెల్లంపల్లి రూరల్: కోడి పందాలు ఆడుతున్న 16 మంది అరెస్ట్
  •      18 బైక్​లు, రూ.24,040 స్వాధీనం

బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో కోడి పందాల స్థావరాలపై దాడులు చేయగా 16 మంది పట్టుబడ్డారు. టాస్క్​ఫోర్స్​ఏసీపీ శ్రీనివాస్​వివరాల ప్రకారం.. కళ్లంపల్లి గ్రామ శివారులో కోడిపందాలు జరుగుతున్నాయని పక్కా సమాచారం మేరకు బుధవారం అర్ధరాత్రి టాస్క్​ఫోర్స్, నీల్వాయి పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. 

దాడుల్లో కుడిమేత సాయి, జన్నె కమలాకర్, బి.కోటేష్, టి.సాయి, చౌదరి తిరుపతి, ఆత్రం సందీప్​, మొగిలి మల్లేశ్, ఎం.హనుమంతు, ఎ.మధుకర్, మానేపల్లి రాజన్న, మానేపల్లి విలాస్, కీర్తి లక్ష్మణ్​, కర్పేత తిరుపతి, దందేర మహేశ్, సతిపతి రాజశేఖర్, దోమల మల్లేశ్​ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 18 బైక్​లు, 12 సెల్​ఫోన్లు, రూ.24,040 ,  4 కోడిపుంజులు, 45 కోడి కత్తులను స్వాధీనం చేసుకుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడిలో టాస్క్​ఫోర్స్​ఎస్సై రమేశ్, నీల్వాయి ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.