బాసర ట్రిపుల్ ఐటీకి ప్రపంచ స్థాయి గుర్తింపు

బాసర ట్రిపుల్ ఐటీకి ప్రపంచ స్థాయి గుర్తింపు
  •      విద్యావారోత్సవాలపై ప్రతిష్టాత్మక ‘ది వాషింగ్టన్ పోస్ట్’లో  స్పెషల్ స్టోరీ 
  •      ఫోర్బ్స్ వరల్డ్ రికార్స్​లో చోటు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. క్యాంపస్​లో మే నెల 11 నుంచి 17 వరకు నిర్వహించిన విద్యావారోత్సవాలను అంతర్జాతీయ స్థాయి పత్రిక అయిన ‘ది వాషింగ్టన్ పోస్ట్’​లో స్పెషల్ స్టోరీగా ప్రచురించింది. అలాగే ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ వరల్డ్ రికార్స్​లో కూడా ట్రిపుల్​ఐటీ విద్యా వారోత్సవాలకు ప్రత్యేక చోటు కల్పించింది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, వారాంతం పొడువునా విద్యా, విజ్ఞానం ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, విద్యార్థుల సామాజిక బాధ్యత వంటి విభిన్న రంగాల్లో వినూత్న కార్యక్రమాలు నిర్వహించడంతో బాసర ట్రిపుల్ ఐటీకి ఒకేసారి రెండు ప్రపంచ స్థాయి సంస్థల నుంచి గుర్తింపు లభించింది. 

ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై వారోత్సవాల్లో ప్రత్యేక సదస్సులు, అవగాహన ర్యాలీలు, పోస్టర్ల ప్రదర్శనలు, వర్క్ షాపులు, ఇంటరాక్టివ్ సెషన్లు, పర్యావరణ కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకుల కృషితోనే సంస్థకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని వైస్ చాన్సలర్​ ప్రొఫెసర్ గోవర్ధన్ హర్షం వ్యక్తం చేశారు.