జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామ సర్పంచ్ ఆకుల రవికి అరుదైన అవకాశం లభించింది. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో తేనేటి విందులో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం లోకభవన్‌లో ‘ఎట్ హోం’ తేనీటి విందులో పాల్గొనాలని రవికి ఆహ్వానం అందింది.
ఇంకుడుగుంతల నిర్మాణం, జల సంరక్షణలో ముదిగంట ఆదర్శంగా నిలిచింది. దీంతో ఈ ఏడాది మార్చి 29న మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ గ్రామాన్ని ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే గ్రామ సర్పంచ్‌కి గవర్నర్ నుంచి ఆహ్వానం లభించింది.
