బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన కోసం..సూర్యాపేటలో భారీ ర్యాలీ

బుల్లెట్ ట్రైన్ కారిడార్ సాధన కోసం..సూర్యాపేటలో భారీ ర్యాలీ

సూర్యాపేట, వెలుగు:  జాతీయ రహదారి 65 సమాంతర బుల్లెట్ ట్రైన్ కేటాయింపులో జరిగిన మోసాన్ని నిరసిస్తూ సూర్యాపేట పట్టణంలో గురువారం వేలాది మంది విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు భారీ ర్యాలీ నిర్వహించారు. 

ఫిబ్రవరిలో ఎన్ హెచ్ 65 సమాంతరంగా మంజూరైన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్‌‌‌‌‌‌‌‌ను మార్చడాన్ని నిరసిస్తున్న ఆందోళనకారులు, సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ వెళ్లే వరకు ఢిల్లీ పీఠం కదిలేలా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, వచ్చిన బుల్లెట్ ట్రైన్‌‌‌‌‌‌‌‌ను సాధించుకునే వరకు పోరాటం ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. 

పట్టణంలోని 60 ఫీట్ల రోడ్డు, కొత్త బస్టాండ్ ఏరియా, పీఎస్ఆర్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్, వాణిజ్య భవన్ సెంటర్ లో ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలోఐక్య విద్యార్థి సంఘం నాయకులు పుల్లూరి సింహాద్రి, ధనియాకుల శ్రీకాంత్ వర్మ, భాష పొంగు సునీలు, ఎర్ర అఖిల్, బొమ్మగాని వినయ్, భారీ అశోక్, పోలోజు మహేశ్, అహ్మద్ అలీ, పారాల సాయి, పోలేబోయిన కిరణ్ తదితరులు 
పాల్గొన్నారు.