హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఉన్న ప్రముఖ బేకరీ సంస్థ థియోబ్రోమా ఫూడ్స్ సెంట్రల్ కిచెన్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎక్స్పైర్ అయిన చికెన్ వింగ్స్ ను వండి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే సుమారు 24 కిలోల బంగాళాదుంపలు బూజుపట్టగా, 60 కిలోల చాక్లెట్ కలెట్స్ పాడైపోయి ఉండటంతో వాటిని అక్కడికక్కడే పడవేశారు.
కిచెన్ పరిసరాలు అత్యంత అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, అక్కడ పురుగులు సంచరిస్తున్నట్లు అధికారులు తేల్చారు. కేక్‌లపై నేరుగా ఏసీ నీరు కారుతున్నట్లు గుర్తించారు.బేకింగ్ ట్రేలు అపరిశుభ్రంగా ఉన్నాయి. డస్ట్ బిన్లకు మూతలు లేకపోగా, ఆహార పదార్థాలు చిందరవందరగా పడి ఉన్నాయి. కోడిగుడ్లపై (Eggs) మల కాలుష్యం ఉండటాన్ని అధికారులు గమనించారు. అంతేకాకుండా, ఆహార పదార్థాలను నేరుగా నేలపైనే నిల్వ చేస్తున్నారు.
FSSAI లేబులింగ్ నిబంధనలను ఉల్లంఘించిన ఉత్పత్తులను అధికారులు సీజ్ చేశారు. లైసెన్స్ కేటగిరీలు, పరిధి విషయంలోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు, తప్పు FSSAI కేటగిరీ కింద ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి తగిన చర్యలు చేపట్టారు.
