ముంబై ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ : ఆయన వెంట భార్య కూడా..!

ముంబై ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ : ఆయన వెంట భార్య కూడా..!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. ఆరోగ్య పరీక్షలు, చికిత్స కోసం పవన్ కల్యాణ్ ఏకంగా ముంబై వెళ్లటం జనసేన పార్టీ కార్యకర్తల్లో కంగారు పుట్టిస్తుంది. కొంత కాలంగా పవన్ కల్యాణ్ రెండు భుజాలకు సంబంధించి రొటేటర్ కఫ్ గాయం, కండరాలు చిట్లటం వల్ల వచ్చే తీవ్ర నొప్పితో బాధపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు. పూర్తిగా నయం కాకపోవటంతో.. ఇప్పుడు ముంబైలో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించారు. 

ఈ క్రమంలోనే 2026, జూన్ 29వ తేదీన భార్యతో కలిసి ముంబై వెళ్లారు. అక్కడ అంబానీ ఫ్యామిలీకి చెందిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోన్నారు. వైద్య పరీక్షలు, చికిత్స ముంబై వెళ్లిన పవన్ కల్యాణ్ కొన్ని రోజులు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తారనే సమాచారం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. 

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యంతో ముంబై నుంచి తిరిగి రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్ష వ్యక్తం చేశారు. 

►ALSO READ | టీటీడీ అధికారుల నిర్లక్ష్యంపై భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై విమర్శలు