Kangana Ranaut: కిస్ సీన్‌లో రక్తం వచ్చేలా హీరో పెదవులు కొరికానా? వైరల్ రూమర్స్‌పై కంగనా షాకింగ్ రియాక్షన్!

Kangana Ranaut: కిస్ సీన్‌లో రక్తం వచ్చేలా హీరో పెదవులు కొరికానా?  వైరల్ రూమర్స్‌పై కంగనా షాకింగ్ రియాక్షన్!

బాలీవుడ్ బ్యూటీ కంగానా రనౌత్ ( Kangana Ranaut ) నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.  లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక పాత గాసిప్ సోషల్ మీడియాలో మళ్లీ తెరపైకి వచ్చి కొత్త చర్చకు తెరలేపింది. కంగనా,  ప్రముఖక మెడియన్ యాక్టర్ వీర్ దాస్ (Vir Das) కాంబినేషన్‌లో 2014లో వచ్చిన క్రైమ్ కామెడీ డ్రామా చిత్రం 'రివాల్వర్ రాణి’ (Revolver Rani). ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన ఒక కిస్సింగ్ సీన్ వివాదం ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది.

ఆ గాసిప్ ఏంటంటే?

ఇటీవల ఒక జర్నలిస్ట్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. 'రివాల్వర్ రాణి' షూటింగ్ సమయంలో కంగనా, వీర్ దాస్‌ల మధ్య ఒక ఘాటైన కిస్ సీన్ ప్లాన్ చేశారని చెప్పారు. అయితే డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత కూడా కంగనా రనౌత్ కిస్ చేయడం ఆపలేదని, ఆ క్రమంలో వీర్ దాస్ పెదవి తెగి, రక్తం వచ్చేలా కొరికేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వీర్ దాస్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడంటూ సదరు జర్నలిస్ట్ చెప్పుకొచ్చారు. 

 

కొట్టిపారేసిన వీర్ దాస్..

ఈ రూమర్స్ హద్దులు దాటడంతో నటుడు వీర్ దాస్ స్వయంగా సోషల్ మీడియావేదికగా క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తూ.. ఈ కథనం పక్కా కల్పితం. సెట్స్‌లో కంగనా రనౌత్ పక్కా ప్రొఫెషనల్‌గా ప్రవర్తించారు. ఆమె చాలా అద్భుతమైన నటి. నా కామెడీ విషయాల వల్ల ఆమె నన్ను సటెర్రరిస్ట్స అని పిలిచిన మాట నిజమే కావచ్చు.. కానీ సెట్స్‌లో మాత్రం మా మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇది ఆమెపై జరుగుతున్న దుష్ప్రచారం అని వీర్ దాస్ రాసుకొచ్చారు.

►ALSO READ \ డెలివరీ బాయ్తో ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో లొల్లి.. వీడియో వైరల్ !

కంగనా ఘాటు రియాక్షన్..

వీర్ దాస్ చేసిన పోస్ట్‌పై కంగనా రనౌత్ తనదైన శైలిలో స్పందించింది. థాంక్స్ వీర్.. కానీ ఇంతకీ ఎవరామె (జర్నలిస్ట్)? ఈ వయసులో కూడా మన ఇద్దరినీ వాడుకుంటూ తన దెయ్యపు లైంగిక కోరికలను తీర్చుకోవాలని చూస్తున్నట్లుంది. నేనేదో నీ రక్తం తాగేసినట్లు, నువ్వు ఇప్పటికీ ఏడుస్తున్నట్లు కథలు చెప్తోంది.. ఎంత విడ్డూరం అంటూ కంగనా గట్టి కౌంటర్ ఇచ్చింది.