128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన ఇండియా విమెన్స్ జట్టు

128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్.. అర్హత సాధించిన ఇండియా విమెన్స్ జట్టు

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి ముందుగానే ఎగ్జిట్ అయ్యి తీవ్ర నిరాశలో ఉన్న ఇండియా విమెన్స్ జట్టుకు ఇది పెద్ద ఉపశమనంతో కూడుకున్న వార్త. 2028లో లాస్ ఏంజిల్స్ లో జరగనున్న ఒలింపిక్ గేమ్స్ కు ఇండియా మహిళల టీమ్ అర్హత సాధించింది.  గ్రూప్ 'ఎ'లో తమ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడినప్పటికీ..  వరల్డ్ కప్ కు అర్హత సాధించింది. ఒలింపిక్ గేమ్స్ కు అందుబాటులో ఉన్న ఆరు స్థానాలలో ఒకదానిని ఇండియా దగ్గించుకోవడం గమనార్హం. 

ఒలింపిక్ గేమ్స్ లో క్రికెట్ రీ ఎంట్రీకి అవకాశం ఇచ్చిన తరుణంలో ఇండియా మహిళల జట్టు అర్హత సాధించడం విశేషం. 128 ఏళ్ల గ్యాప్ తర్వాత ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చుతున్నారు. దీనికి సంబంధించిన ఎలిజిబులిటీ క్రైటీరియాను  క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం (జూన్ 29)  కన్ఫమ్ చేసింది. దీని ప్రకారం, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో జరిగే పురుషుల, మహిళల టీ20 పోటీలలో చెరో ఆరు జట్లు పాల్గొంటాయి.

ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఆసియాలో అర్హత సాధించిన జట్లలో టాప్ లో ఉన్న భారత్ అర్హత సాధించింది. హర్మన్‌ప్రీత్ టీమ్ సెమీఫైనల్స్‌కు చేరుకోలేక పోయినప్పటికీ, టోర్నమెంట్‌లో ఇతర ఆసియా జట్ల కంటే బెస్ట్ పర్ఫామెన్స్ తో  టాప్ లో నిలిచింది. దీంతో ఒలింపిక్ బెర్త్‌ను ఖాయం చేసింది.

ఇండియాతో పాటు  మరో మూడు జట్లు..

ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ స్థానాల్లో నిలిచిన ఆఫ్రికా, ఆసియా, యూరప్, ఓషియానియాలకు ఒక్కో కంట్రీకి ఆటోమేటిక్ గా స్థానం లభించనుంది.  ప్రతి ఖండం నుంచి ఒక టీమ్ కు మాత్రమే పరిమితి ఉండటం గమనార్హం. ఇక్కడ ఓషినియా అంటే ఫసిఫిక్ మహా సముద్రలో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తో పాటు ఇతర ఐలండ్స్ ఈ కోవలోకి వస్తాయి. 

►ALSO READ | వైభవ్ ఏం తోపు కాదు.. అవకాశాల కోసం వెయిట్ చేయాల్సిందే: బుడ్డోడి అరంగ్రేటంపై కోచ్ డోస్కేట్

ఆస్ట్రేలియా ఓషియానియా స్థానాన్ని దక్కించుకోగా, నాకౌట్ దశకు చేరుకున్న దక్షిణాఫ్రికా ఆఫ్రికా కూడా అర్హత సాధించింది. ఐసీసీ పోటీలలో ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించే గ్రేట్ బ్రిటన్, యూరప్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఫలితంగా, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ (ఇంగ్లాండ్), ఇండియా, దక్షిణాఫ్రికా దేశాలు LA28 కు అర్హత సాధించిన తొలి నాలుగు మహిళల జట్లుగా నిలిచాయి.

2026 జూన్ 30 నుంచి డిసెంబర్ 31 మధ్య..  ఆతిథ్య దేశమైన అమెరికా ఐసీసీ మహిళల టీ20ఐ ర్యాంకింగ్స్‌లో టాప్ 15 లోకి ప్రవేశిస్తే, ఐదవ జట్టుగా ఒలింపిక్స్ కు ఎంపికయ్యే అవకాశం ఉంది. 
ఆరవ  లేదా చివరి ఒలింపిక్ స్థానం 2027లో జరిగే తొలి ఐసీసీ ఒలింపిక్స్ క్వాలిఫైయర్ ద్వారా నిర్ణయిస్తారు.