ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. పొల్యూషన్ కంట్రోల్ చేయటానికి కీలకమైన నిర్ణయం తీసుకున్నది. 2027, జనవరి ఒకటో తేదీ నుంచి పెట్రోల్ తో నడిచే టూ వీలర్స్ రిజిస్ట్రేషన్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నది. అంటే.. మరో ఆరు నెలల్లో ఢిల్లీలో పెట్రోల్ టూ వీలర్స్ అమ్మకాలు బంద్ కానున్నాయి. ఒక వేళ మీరు పెట్రోల్ టూ వీలర్ కొంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేయరు.. అవును.. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం కొత్త EV పాలసీ ఇదే చెబుతున్నది. అంటే మరో ఆరు నెలల్లో ఢిల్లీలో పెట్రోల్ బైక్స్, స్కూటీలు బంద్ కానున్నాయి.. ఓన్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయనున్నారు. వాహనదారులకు ఇది షాకింగ్ న్యూసే.. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ ని ప్రకటించింది. 2026 జులై 01 నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి వస్తున్నట్లు సీఎం రేఖా గుప్త తెలిపారు. కొత్త పాలసీకి గవర్నర్ ఆమోదం లభించడంతో.. జులై 1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కొత్త పాలసీ 2030 మార్చి 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. దీనికి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఈవీలకు మాత్రమే రిజిస్ట్రేషన్:
ఈ కొత్త పాలసీ ప్రకారం.. 2027 జనవరి 1 నుంచి ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు, ఎన్1 కేటగిరీ గూడ్స్ వాహనాలను మాత్రమే రిజిస్టర్ చేస్తారు. ఏప్రిల్ 1, 2028 నుంచి, కేవలం ఎలక్ట్రిక్ టూ వీలర్స్ (బైక్స్) మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్ చేయనున్నారు. దీంతో కొత్త పెట్రోల్, CNGతో నడిచే బైకుల రిజిస్ట్రేషన్ దశలవారీగా నిలిపివేయడం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాలుష్యాన్ని, ముఖ్యంగా కమర్షియల్ వెహికల్స్ నుంచి వెలువడే కాలుష్య కారకాలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
EV వాహనాలకు ప్రోత్సాహం..
ఢిల్లీ కొత్త ఈవీ పాలసీపై రవాణా కమిషనర్ నిహారిక మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ టూవీలర్స్ కొనేవారికి రూ.30 వేల వరకు, ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు రూ.50 వేల వరకు, ఎన్1 ఎలక్ట్రిక్ ట్రక్కులకు రూ.1 లక్ష వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికి తోడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారు.. పాత వాహనాలను స్క్రాప్ చేస్తే మరిన్ని డిస్కౌంట్స్ అందించనున్నట్లు పేర్కొన్నారు.
►ALSO READ | ఇంటి ఫుడ్ తీసుకెళ్లే వారికి రైల్వే అధికారులు షాక్.. ఒక్క రోజులోనే 1450 కేసులు.. రూ.3 లక్షల జరిమానా..!
వీటితో పాటు మరిన్ని బంపర్ ఆఫర్స్ ప్రకటించి ఢిల్లీ ప్రభుత్వం. ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపు కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే, ఈ కొత్త విధానంలో హైబ్రిడ్ వాహనాలకు ఎలాంటి సబ్సిడీ ఉండదని చెప్పారు.
ఛార్జింగ్ పరిస్థితేంటి..?
కొత్త పాలసీ కింద పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న క్రమంలో.. వెహికల్స్ కు ఛార్జింగ్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఆందోళన అవసరం లేదని.. ఢిల్లీ వ్యాప్తంగా దశల వారీగా 23, వేల ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పాఠశాల బస్సులను కూడా దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చనున్నట్లు తెలిపారు. ఈవీల వినియోగానికి మద్దతుగా విద్యుత్ మౌలిక సదుపాయాలను కూడా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు.
ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి అందించడమే లక్ష్యం
అత్యధిక ట్రాఫిక్, వాహనాలు, పొగ కారణంగా ఢిల్లీని నివాస యోగ్యమైన నగరాల జాబితాలో కిందికి పడిపోయిన పరిస్థితి. ఢిల్లీలో స్వచ్ఛమైన గాలి పీల్చే రోజులు రావాలని.. అందులో భాగంగానే కర్బన ఉద్గారాలను చేసే సంప్రదాయ వాహనాలకు బదులుగా.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను తీసుకురానున్నట్లు రవాణా శాఖ మంత్రి డాక్టర్ పంకజ్ సింగ్ అన్నారు. రాబోయే నాలుగేళ్లలో సిటీలో గాలి నాణ్యతను మెరుగుపరుస్తూ, స్వచ్ఛమైన రవాణా మార్గాలను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు.
