ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌పై అనౌన్స్ మెంట్ వచ్చేసింది. మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై నిర్మాత నాగవంశీ మరోసారి హైప్ పెంచేశారు. శివుడి త్రిశూలం, డీఎన్‌ఏ ఆకారంలోని అంశాలతో విడుదలైన ఈ కాన్సెప్ట్ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.
ఇందులో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘శివుడి కుమారుడు.. పార్వతిదేవికి గర్వకారణం.. దేవ సేనాని.. మరోసారి త్రివిక్రమ్‌తో’ అంటూ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
The Son of Shiva.
— Jr NTR (@tarak9999) June 29, 2026
The Pride of Parvathi.
The Eternal Commander.
And, once again with TRIVIKRAM.#NTRxTrivikram pic.twitter.com/oIW7o4PETu
ఈ నేపథ్యంలోనే ‘‘ఒకే అస్త్రం.. ఒకే ధ్యేయం.. ఒక దివ్య ప్రతీకారం’’ అనే మిస్టికల్ పదాలతో నాగవంశీ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. అంతేకుండా ‘‘ఉత్తరంలో పుట్టింది. భారత హృదయంలో తీర్చిదిద్దబడింది.. దక్షిణాదిలో దైవంగా పూజించబడింది.. ఇప్పుడు.. యావత్ విశ్వానికి సొంతమయ్యే కథగా అవతరించబోతోంది’’ అంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Born in the North.
— Naga Vamsi (@vamsi84) June 29, 2026
Forged in the Heartland.
Worshipped in the South.
Now... A tale destined to belong to the universe 💥💥#NTRxTrivikram@tarak9999 #Trivikram @anirudhofficial #SRadhaKrishna @NANDAMURIKALYAN @haarikahassine @NTRArtsOfficial @NTRxTrivikram pic.twitter.com/df7t6kD2oJ
కుమారస్వామిగా ఎన్టీఆర్..
‘అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకడిగా నా ఫేవరెట్ బ్రదర్’ అంటూ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓ శ్లోకాన్ని గతంలో నాగవంశీ చెప్పుకొచ్చారు. గత ఏడాది ముంబై విమానాశ్రయంలో ఎన్టీఆర్ చేతిలో Muruga - The Lord of War, The God of Wisdom పుస్తకం కనిపించడం మరిన్ని ఊహాగానాలకు దారితీసింది. దీంతో ఈ సినిమా కోసం ఆయన అప్పుడే సిద్ధమవుతున్నారనే ప్రచారం మొదలైంది. ఇక ఈ ప్రాజెక్ట్లో కార్తికేయుడుగా ఎన్టీఆర్ కనిపిస్తున్నట్లుగా కన్ఫామ్ అవ్వడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
కథపై ఆసక్తిర టాక్..
‘పరమశివుని పుత్రుడు.. పార్వతీమాత గర్వకారణం’ అనే పదాలతో చిత్ర బృందం సుబ్రహ్మణ్య స్వామి జననాన్ని సూచించినట్లు తెలుస్తోంది. తారకాసురుడి సంహారం కోసం అవతరించిన దేవసేనాధిపతి కార్తికేయుడి కథే ఈ చిత్రానికి స్ఫూర్తిగా ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఎన్టీఆర్ పాత్ర ఓ మహా సైన్యాన్ని నడిపించే వీరయోధుడిగా కనిపించబోతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
