గాలే టెస్ట్‌కు వరుణుడి ముప్పు.. భారత్ vs శ్రీలంక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారుతుందా?

గాలే టెస్ట్‌కు వరుణుడి ముప్పు.. భారత్ vs శ్రీలంక మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారుతుందా?

IND vs SL 1st Test: తొమ్మిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ శ్రీలంక గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది. రేపటి ( శనివారం, ఆగస్టు 15న) నుంచి గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ చారిత్రక మ్యాచ్‌పై ఇప్పుడు వర్షం నీలినీడలు కమ్ముకుంది. ఇప్పటికే శ్రీలంకలోని దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న గాలే నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గురువారం నాడు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ కూడా పూర్తిగా రద్దు అయింది. త 

ఏ రోజు ఎంత శాతం వర్షం: 

ఆక్యువెదర్ (AccuWeather) అంచనా ప్రకారం, ఐదు రోజుల పాటు జరిగే ఈ టెస్టు మ్యాచ్‌లో వర్షం పదే పదే ఆటంకం కలిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వర్షంతో పాటు గాలేలో ఉష్ణోగ్రతలు ఐదు రోజుల పాటు 30°C నుంచి 32°C మధ్య ఉండనుంది. విపరీతమైన తేమ (Humidity) కారణంగా మైదానంలో ఆటగాళ్లకు శారీరకంగా తీవ్రమైన అలసట ఎదురయ్యే ఛాన్స్ ఉంది.

 

ఐదు రోజుల్లో ఎప్పుడు ఎంత వర్షం కురుస్తుందంటే:  

* మొదటి రోజు (శనివారం): 80 శాతం నుంచి 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ ప్రారంభ సమయానికి టాస్ పడటం కూడా కష్టమేనని సమాచారం.

* రెండవ రోజు (ఆదివారం): 66 శాతం నుంచి 74 శాతం వర్షం కురిసే సూచనలు ఉన్నాయి. 

* మూడవ రోజు (సోమవారం): 81 శాతం వర్షపాతం నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. 

* నాలుగో రోజు (మంగళవారం): 55 శాతం వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. 

* ఐదో రోజు (బుధవారం): 56 శాతం వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది.