ఆ యువతి సాఫ్ట్ వేర్. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమె కంటే రెండింతలు ఎక్కువ సంపాదించే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో పెళ్లి కుదిరింది. అంతా బానే సెట్టయింది.. కానీ.. పెళ్లికి ముందు ఒక్క ప్రశ్న అడిగాడు.. అంతే నువ్వెంత సంపాదిస్తే నాకేంటి.. అన్నట్లుగా మొహం మీదనే పెళ్లి క్యాన్సిల్.. నేను రిజెక్ట్ చేస్తున్నానని చెప్పేసింది. ఈ స్టోరీ చదివితే ఆ విషయంలో అమ్మాయిలు ఎంత క్లారిటీగా ఉన్నారో అర్థమవుతుంది.
బెంగళూరుకు చెందిన ఆ యువతి పేరు ఎం.నందిని.. పెళ్లి అంటే మొదటి నుంచి ఇంట్రెస్ట్ చూపలేదు కానీ.. పెళ్లీడు వచ్చింది అని పేరెంట్స్ ఫోర్స్ చేస్తుంటే ఓకే చెప్పేసింది. దీంతో ఒ సంబంధం కుదిరింది. అంతా ఓకే.. అయితే నిఖా పక్కా చేసుకునే ముందు ఇద్దరు ఒకసారి కలిసి మాట్లాడుకోండని ఆమె తల్లి చెప్పిందట. ఇద్దరు ఒక హోటల్ లో కలిసి.. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ మాట్లాడుకుంటున్నారు. అతడు అడిగిన ఒక్క ప్రశ్నకు రిజెక్ట్ చేస్తున్నట్లు ఫేస్ టు ఫేస్ చెప్పేసింది.
ఎందుకు రిజెక్ట్ చేసింది..
నందిని 90 వేల రూపాయలు సంపాదిస్తుంటే.. ఆ అబ్బాయికి రెండు లక్షల రూపాయల శాలరీ. అబ్బాయి పేరెంట్స్ తో ఉంటాడు. వాళ్ల బాధ్యత అంతా అతనిదే. అలాగే అతడికి పెళ్లయిన ఒక సిస్టర్ ఉంటుంది.. అప్పుడప్పుడు ఫైనాన్షియల్ గా బ్రదర్ పై ఆధారపడుతుంటుంది.
అదే టైమ్ లో అమ్మాయి ఒక్కతే. ఎలాంటి బరువు బాధ్యతలు లేవు. పేరెంట్స్ ఊర్లో ఉంటే ఆమె ఒక్కతే సిటీలో సింగిల్ గా ఉంటుంది. తను చాలా లేజీ అని.. ఖాళీ టైమ్ ఉంటే బెడ్ మీద రెస్ట్ తీసుకోవడానికే ఇష్టపడతానని చెప్పింది. తను ఫెమినిస్ట్ అని కూడా చెప్పేసింది.
మాటల్లో మాట.. నువ్వు ఫెమినిస్ట్ కదా.. ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలని అనుకుంటావు కదా.. మరి పెళ్లి తర్వాత నీ శాలరీలో ఫ్యామిలీ కోసం 50 శాతం స్పెండ్ చేస్తావా..? అని అడిగాడట. దానికి నందిని ఓకే చెప్పిందట. అదే విధంగా ఇల్లు చూసుకునేందుకు జాబ్ మానేస్తావా అని అడిగ్గా.. నో.. ఇల్లు చూసుకోను.. జాబ్ మానేయను.. అని చెప్పేసిందట.
ఎందుకు ఒక అమ్మాయి ఆర్థికంగా పురుషులపైనే ఆధారపడాలి.? అని ప్రశ్నించానని చెప్పింది. నీకు నీపైన ఆధారపడే భార్య కావాల్సినపుడు.. నాలాంటి వారు సెట్ అవ్వరు.. నీకు హోం మేకర్ కావాల్సినప్పుడు నాలాంటి వర్కింగ్ వుమెన్ ను ఎందుకు కన్వీన్స్ చేయాలని చూస్తున్నావు.. అని అడిగి.. నీకు నాకు కుదరదు అని చెప్పేసిందట.
మొత్తానికి పెళ్లి ప్రపోజల్ క్యాన్సిల్:
ఆ మాట చెప్పగానే అతడి ఫేస్ అంతా ఛేంజ్ అయినట్లు నందిని చెప్పింది. అయినప్పటికీ కన్వీన్స్ చేయాలని చూశాడని తన స్టోరీలో చెప్పుకొచ్చింది. సో.. నన్ను రిజెక్ట్ చేస్తున్నవా.? అని అతడు అడగగా.. ఎస్.. నీకు ఇదే కరెక్ట్.. నేను ఒక ఫెమినిస్ట్.. ఇండిపెండెంట్ గా.. స్వతంత్రంగా ఉండేందుకు ఇష్టపడతా..అని చెప్పింది.
ఆ తర్వాత ఆర్డర్ చేసిన ఫుడ్ తినేసి.. తన హాఫ్ పేమెంట్ కట్టేసి.. ఆ అబ్బాయికి బైబై చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయానని తన ఎక్స్ అకౌంట్ లో రాసింది.
సో ఈ స్టోరీని బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న జెన్ జీ అమ్మాయిలు.. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండాలని అనుకుంటున్నారు.. బరువు బాధ్యతలను నెత్తిన వేసుకోవాలని అనుకోవట్లేదు.. ముఖ్యంగా.. హోమ్ మేకర్ గా ఉండాలనే కండిషన్ పెట్టారంటే పెళ్లిళ్లు ఇలాగే రిజెక్ట్అయ్యే ప్రమాదం ఉంది.. సో అబ్బాయిలు.. కాస్త ఆలోచించి అడుగేయండి.
Few months back my mother emotionally blackmailed me into meeting a guy who earns more than twice my salary.
— Nandini M (@your_niaaaa) August 14, 2026
He earns ₹2 lakh a month. I work in IT and earn ₹90K.
He lives with his parents, who depend on him financially. His married sister is a homemaker and apparently also…
