రేపే భారత్ vs శ్రీలంక తొలి టెస్ట్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసా?

రేపే భారత్ vs శ్రీలంక తొలి టెస్ట్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసా?

IND vs SL 1st Test: భారత క్రికెట్ జట్టు మరో కీలకమైన సమరానికి సిద్ధమైంది. సుదీర్ఘంగా 9 సంవత్సరాల విరామం తర్వాత టీమిండియా టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక గడ్డపై అడుగు పెట్టింది. యువ సంచలనం శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ఇండియన్ టీమ్, రేపు (ఆగస్టు 15, శనివారం) నుంచి లంకతో రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో ఓటములు ఎదురవ్వడం, గత డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించలేకపోవడంతో ఒత్తిడిలో ఉన్న భారత్‌కు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది.

భారత్కు ఈ సిరీస్ చాలా కీలకం:

డబ్ల్యూటీసీ (WTC) 2025–27 సైకిల్‌లో శుభారంభం చేయడం భారత్‌కు ఎంతో అవసరం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జోడీకి ఇది ఒక పెద్ద సవాలుగా మారింది. ఇటీవల చవిచూసిన పరాజయాలను మరిచిపోయి, జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపాలంటే శ్రీలంకపై సిరీస్ విజయం సాధించక తప్పదు. గిల్ నాయకత్వ పటిమకు కూడా ఈ పర్యటన ఒక పెద్ద పరీక్షగా నిలవనుంది.

తొలి టెస్టు లైవ్ మ్యాచ్ ఎక్కడ, ఏ టైమ్కి చూడొచ్చు?: 

* వేదిక: గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గాలే (శ్రీలంక)
* తేదీ & సమయం: ఆగస్టు 15 (శనివారం) నుంచి ఉదయం 10:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
* టీవీ ప్రసారం: భారతదేశంలో ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony Sports Network) ఛానెళ్లలో చూడవచ్చు.
* ఉచితంగా చూడటం ఎలా?: డీడీ ఫ్రీ డిష్ (DD Free Dish) కస్టమర్ల నుంచి ఎలాంటి రుసుము లేకుండా డీడీ స్పోర్ట్స్ (DD Sports) ఛానెల్‌లో మ్యాచ్‌ను ఉచితంగా వీక్షించవచ్చు.
* లైవ్ స్ట్రీమింగ్ (OTT): మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లలో చూడాలనుకునేవారు సోనీలివ్ (SonyLIV) యాప్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని ఆస్వాదించవచ్చు.

ఇరు జట్ల పూర్తి స్క్వాడ్:

భారత జట్టు (Team India): యాశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకిబ్ నబీ, ధ్రువ్ జురెల్, గుర్నూర్‌ బ్రార్, సరాన్ష్ జైన్.

శ్రీలంక జట్టు (Sri Lanka Squad): నిషాన్ మదుష్క, లాహిరు ఉదార, దినేష్ చండిమాల్, కామిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), పసిందు సూరియబండార, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), రమేష్ మెండిస్, ప్రభాత్ జయసూర్య, అసిథ ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, సోనాల్ దినూష, మిలాన్ రత్నాయకే, కేశర నువంత.