‘ఏఈబీఏఎస్’లో ఫ్యాకల్టీ వివరాల నమోదుకు మరో చాన్స్..3 వారాల గడువు ఇచ్చిన ఎన్ఎంసీ

‘ఏఈబీఏఎస్’లో ఫ్యాకల్టీ వివరాల నమోదుకు మరో చాన్స్..3 వారాల గడువు ఇచ్చిన ఎన్ఎంసీ

హైదరాబాద్, వెలుగు: మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీ వివరాల నమోదుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌‌ఎంసీ) మరో 3 వారాల గడువు ఇచ్చింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానం(ఏఈబీఏఎస్) పోర్టల్‌‌లో టీచింగ్ ఫ్యాకల్టీతోపాటు జూనియర్ రెసిడెంట్లు, సీనియర్ రెసిడెంట్లు, ట్యూటర్లు, డెమాన్‌‌స్ట్రేటర్ల నేషనల్ మెడికల్ రిజిస్టర్ లేదా స్టేట్ మెడికల్ రిజిస్టర్ నంబర్లను తప్పనిసరిగా అప్‌‌డేట్ చేయాలని ఎన్‌‌ఎంసీ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లంగర్ పేర్కొన్నారు.

మెడికల్ ఫ్యాకల్టీ ఎట్టిపరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్ కాలమ్​ను ఖాళీగా వదిలేయకూడదన్నారు. ఎమ్మెస్సీ, పీహెచ్‌‌డీ అర్హతలున్న నాన్-మెడికల్ ఫ్యాకల్టీ మాత్రం రిజిస్ట్రేషన్ నంబర్ స్థానంలో ‘ఎన్ఏ’ అని నమోదు చేయాలని ఆదేశించారు. వివరాలు అప్‌‌డేట్ చేయకపోయినా లేదా తప్పుడు వివరాలు ఇచ్చినా బయోమెట్రిక్ హాజరు  బ్లాక్ అవుతుందని హెచ్చరించారు. టెక్నికల్ సమస్యలేవైనా ఎదురైతే కాలేజీ నోడల్ ఆఫీసర్లు అధికారిక హెల్ప్‌‌ డెస్క్ [email protected] ద్వారా సంప్రదించాలని సూచించారు.