హైదరాబాద్, వెలుగు: నగరవాసులకు గ్రామీణ భారతీయ సంస్కృతి, సంప్రదాయ రుచులు, చేనేత వస్త్రాల వైవిధ్యాన్ని ఒకేచోట ఆస్వాదించే అవకాశం లభించనుంది. బుధవారం నుంచి ఈ నెల 18 వరకు ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో సరస్ మేళా నిర్వహించనున్నారు.
సెర్ప్ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో 20 రాష్ట్రాలకు చెందిన గ్రామీణ మహిళలు, స్వయం సహాయక సంఘాలు, కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. మొత్తం 200కుపైగా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణకు చెందినవి 95, ఇతర రాష్ట్రాలకు చెందినవి 100కుపైగా ఉండగా.. వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో మరో 43 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.ఈ నెల 11న బతుకమ్మ వేడుకలు నిర్వహించగా, మంత్రి సీతక్కతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.
