నాలుగేళ్ల తర్వాత పేసర్‌‌ భువనేశ్వర్‌‌ రీ ఎంట్రీ

నాలుగేళ్ల తర్వాత పేసర్‌‌ భువనేశ్వర్‌‌ రీ ఎంట్రీ

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌‌తో ఐదు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్‌‌ కోసం ఇండియా జట్టును మంగళవారం ప్రకటించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత వెటరన్‌‌ పేసర్‌‌ భువనేశ్వర్‌‌ కుమార్‌‌ టీమ్‌‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. 2022లో కివీస్‌‌పై చివరి మ్యాచ్‌‌ ఆడిన భువీ.. ఈ ఏడాది ఐపీఎల్‌‌లో 28 వికెట్లతో ఆకట్టుకున్నాడు. దాంతో మళ్లీ కివీస్‌‌ టూర్‌‌కు అతన్ని సెలెక్ట్‌‌ చేయడం గమనార్హం. ఈ నెల 22, 24, 27, 30, నవంబర్‌‌ 1న మ్యాచ్‌‌లు జరుగుతాయి. మరోవైపు న్యూజిలాండ్‌‌–ఎతో జరిగే మల్టీ డే మ్యాచ్‌‌లకు ఇండియా–ఎ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. కేఎల్‌‌ రాహుల్‌‌, యశస్వి జైస్వాల్‌‌, రిషబ్‌‌ పంత్‌‌ (ఫిట్‌‌నెస్‌‌ నిరూపించుకుంటేనే)ను తీసుకున్నారు. ధ్రువ్‌‌ జురెల్‌‌కు కెప్టెన్సీ అప్పగించారు. మరోవైపు జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌కు ఇండియా విమెన్స్‌ జట్లను ప్రకటించారు. 

టీ20 జట్టు: శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (కెప్టెన్‌‌), అభిషేక్‌‌ శర్మ, సంజూ శాంసన్‌‌, వైభవ్‌‌ సూర్యవంశీ, ఇషాన్‌‌ కిషన్‌‌, తిలక్‌‌ వర్మ, అక్షర్‌‌ పటేల్‌‌, శివమ్‌‌ దూబే, నితీశ్‌‌ కుమార్‌‌, నమన్‌‌ ధీర్‌‌, ప్రిన్స్‌‌ యాదవ్‌‌, మయాంక్‌‌ యాదవ్, అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌, భువనేశ్వర్ కుమార్‌‌, వరుణ్‌‌ చక్రవర్తి, కుల్దీప్‌‌ యాదవ్‌‌. 

ఇండియా–ఎ జట్టు: ధ్రువ్‌‌ జురెల్‌‌ (కెప్టెన్‌‌), యశస్వి జైస్వాల్, రాహుల్‌‌, దేవదత్‌‌ పడిక్కల్‌‌, రవిచంద్రన్‌‌ స్మారన్‌‌, రిషబ్‌‌ పంత్‌‌, సుందర్‌‌, అకిబ్ నబీ, ఆకాశ్‌‌ దీప్‌‌, అన్షుల్‌‌ కాంబోజ్‌‌, మానవ్‌‌ సుతార్‌‌, ముకేశ్‌‌ చౌదరి, సాయి సుదర్శన్‌‌, యష్‌‌ రాథోడ్‌‌, ముకేశ్ కుమార్‌‌.

విమెన్స్​ టీ20 జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్‌), షెఫాలీ వర్మ (వైస్‌ కెప్టెన్‌), నికీ ప్రసాద్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, అనుష్క శర్మ, రిచా ఘోష్‌, కమలిని, దీప్తి శర్మ, ప్రేమ రావత్‌, శ్రీచరణి, నందిని శర్మ, క్రాంతి గౌడ్‌, అరుంధతి రెడ్డి, జింతిమాని కాలితా, మిన్ను మణి. 

వన్డే జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్‌), షెఫాలీ వర్మ, ప్రతీకా రావల్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, హర్లీన్‌ డియోల్‌, తేజాస్‌ హసబిన్స్‌, దీప్తి శర్మ (వైస్‌ కెప్టెన్‌), రిచా ఘోష్‌, యాస్తికా భాటియా, వైష్ణవి శర్మ, నందిని శర్మ, శ్రీచరణి, క్రాంతి గౌడ్‌, సయాలీ సత్గరే, రేణుకా ఠాకూర్‌.