దుబాయ్: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు రేసులో ఇండియా నుంచి నలుగురికి చోటు దక్కింది. మెన్స్‌లో శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మతో పాటు విమెన్స్‌లో షెఫాలీ వర్మ, శ్రీచరణి రేసులో ఉన్నారు. సెప్టెంబర్‌లో అద్భుత పెర్ఫామెన్స్ చూపెట్టిన ప్లేయర్లకు ఐసీసీ ఈ అవార్డును అందజేస్తుంది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు వన్డేల్లో కలిపి గిల్ 333 రన్స్ చేశాడు. అభిషేక్ నాలుగు టీ20ల్లో 229 రన్స్ సాధించాడు. అఫ్గానిస్తాన్‌పై కేవలం 30 బాల్స్‌లోనే సెంచరీతో రికార్డు సృష్టించాడు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా నుంచి పోటీ ఉంది.
ఆసియా కప్, ఆసియా క్రీడల్లో షెఫాలీ అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచింది. శ్రీచరణి ఏడు టీ20ల్లో 18 వికెట్లు తీసి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆల్‌టైమ్ రికార్డు రేటింగ్ పాయింట్లు సాధించింది. లంక కెప్టెన్ చామరి ఆటపట్టు కూడా రేసులో ఉంది.
