- తొలి టీ20లో ఇండియా ఘన విజయం
- 8 వికెట్ల తేడాతో ఓడిన వెస్టిండీస్
- హోప్, రూథర్‌ఫోర్డ్ శ్రమ వృథా
లక్నో: ఛేజింగ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (43 బాల్స్‌లోనే 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 నాటౌట్) సెంచరీ దంచికొట్టడంతో.. వెస్టిండీస్‌తో మంగళవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో హోమ్ టీమ్1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ ఓడిన విండీస్ 19.1 ఓవర్లలో 171 రన్స్‌కు ఆలౌటైంది. కెప్టెన్ షై హోప్ (37 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (34 బాల్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. తర్వాత ఇండియా 14.4 ఓవర్లలో 172/2 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (27 బాల్స్‌లో 5 ఫోర్లతో 37 నాటౌట్) అండగా నిలిచాడు. శ్రేయస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరుగుతుంది.
ఆకట్టుకున్న బౌలర్లు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు హోప్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. తొలి రెండు ఓవర్లలో ఐదు ఫోర్లతో రెచ్చిపోయాడు. రెండో ఎండ్‌లో రెండు ఫోర్లు కొట్టిన కామిల్ పూరన్ (12) ఐదో ఓవర్‌లో వెనుదిరిగాడు. దాంతో స్కోరు 38/1గా మారింది. అయితే ఆరో ఓవర్‌లో అక్షర్ పటేల్ (2/33) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. రెండో బాల్‌కు హెట్‌మయర్ (5) రనౌట్ కాగా, ఐదో బాల్‌కు రోవ్‌మన్ పావెల్ (0) డకౌటయ్యాడు. మెయిడెన్ ఓవర్‌తో పాటు రెండు వికెట్లు పడటంతో కరీబియన్లు 44/3తో పవర్‌ప్లేను ముగించారు. ఈ దశలో రూథర్‌ఫోర్డ్.. హోప్‌కు అండగా నిలిచాడు.
ఈ ఇద్దరు కలిసి భారీ షాట్లకు తెరలేపడంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 38 రన్స్ రావడంతో స్కోరు 82/3కి పెరిగింది. 11వ ఓవర్‌లో ఇద్దరూ కలిసి 4, 4, 6తో 18 రన్స్ దంచారు. ఈ క్రమంలో 36 బాల్స్‌లో హోప్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక్కడినుంచి ఇండియా బౌలర్లు నమన్‌ధీర్ (3/31), కుల్దీప్ యాదవ్ (2/33) మ్యాజిక్ చేశారు. తమ తర్వాతి నాలుగు ఓవర్లలో హోప్, రోస్టన్ ఛేజ్ (5), రోమారియో షెఫర్డ్ (7), మాథ్యూ ఫోర్డీ (2)ను ఔట్ చేశారు. 15 బాల్స్ తేడాలో నాలుగు వికెట్లు పడటంతో విండీస్ స్కోరు15 ఓవర్లలో స్కోరు 127/7కు చేరింది. ఇక్కడి నుంచి వరుస విరామాల్లో షామెర్ స్ప్రింజెర్ (9), అకిల్ హుస్సేన్ (15) వెనుదిరిగినా.. రూథర్‌ఫోర్డ్ బ్యాట్ ఝుళిపించడంతో గౌరవప్రదమైన స్కోరు లభించింది.
తడబడినా..
లక్ష్య ఛేదనలో ఇండియా ఆరంభంలో తడబడినా.. శ్రేయస్ అయ్యర్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. ఓ సిక్స్, మూడు ఫోర్లతో ఛేజింగ్ మొదలుపెట్టిన అభిషేక్ (21) మూడో ఓవర్‌లో, శాంసన్ (11) నాలుగో ఓవర్‌లో ఔటయ్యారు. దాంతో 35/2తో కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ శ్రేయస్, ఇషాన్ కిషన్ ఆదుకున్నారు. రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన శ్రేయస్ ఆరో ఓవర్‌లో మూడు బౌండ్రీలు దంచాడు. దాంతో పవర్‌ప్లేలో ఇండియా 62/2 స్కోరు చేసింది. సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేసిన శ్రేయస్, ఇషాన్ 9వ ఓవర్‌లో ఐదు ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఫలితంగా10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోరు 102/2కు పెరిగింది. 11వ ఓవర్‌లో ఫోర్, సిక్స్‌తో శ్రేయస్ 28 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అక్కడి నుంచి ఎక్కువగా స్ట్రయిక్ తీసుకున్న శ్రేయస్ 13వ ఓవర్‌లో 6, 4, 4... 14వ ఓవర్‌లో 6, 6, 4, 6తో బ్యాట్ ఝుళిపించాడు. 15వ ఓవర్‌లో భారీ సిక్స్‌తో 42 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేయడంతో పాటు ఇండియాను ఈజీగా గెలిపించాడు.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్: 19.1 ఓవర్లలో 171 ఆలౌట్ (షై హోప్ 52, రూథర్‌ఫోర్డ్ 56, నమన్ ధీర్ 3/31, అక్షర్ పటేల్ 2/33). ఇండియా: 14.4 ఓవర్లలో 172/2 (శ్రేయస్ 102*, ఇషాన్ 37*, అకిల్ హుస్సేన్ 1/37).
