బిగ్ అలర్ట్.. ఈ- కేవైసీ ఆగస్ట్ 16 లాస్ట్ డేట్..లేదంటే గ్యాస్ బంద్..

బిగ్ అలర్ట్.. ఈ- కేవైసీ ఆగస్ట్ 16 లాస్ట్ డేట్..లేదంటే గ్యాస్ బంద్..

 

గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. మీరు గనుక ఇప్పటివరకు మీ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్‌కు ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయకపోతే.. వెంటనే ఆ పని చేయండి. లేదంటే మీ గ్యాస్ సబ్సిడీ ఆగిపోవడంతో పాటు, సిలిండర్ బుకింగ్ కూడా క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉంది.

 ఇప్పటికే  తెలంగాణలోని చాలా గ్యాస్ ఏజెన్సీల దగ్గర  వినియోగదారులు క్యూ కట్టారు. రెండు రోజులే గడువు ఉంటంతో ఈ కేవైసీ చేసుకునేందుకు లైన్లలో నిల్చున్నారు. భారీగా రద్దీ వస్తుండటంలో ఏజెన్సీలు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ రాదనే అపోహతో భారీగా తరలివస్తున్నారు వినియోగదారులు 

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంతో పాటు సాధారణ గ్యాస్ కనెక్షన్దారులకు కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 16 లోపు అంటే సరిగ్గా ఎల్లుండి లోపు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీని పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశాయి. ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్.. ఇలా ఏ కంపెనీ కనెక్షన్ అయినా సరే.. ఈ గడువులోగా కేవైసీ చేయించుకోకపోతే సబ్సిడీ కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాదు, సిలిండర్లపై సబ్సిడీ అందక ఎక్కువ ధర చెల్లించక తప్పదు.

ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి ఇప్పటికే ఆయిల్ కంపెనీలు మొబైల్స్‌కు మెసేజ్‌లు పంపుతున్నాయి. అయితే దీనికోసం గ్యాస్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీ ఇంటి దగ్గరే ఉండి ఇండియన్ ఆయిల్ వన్ యాప్ (IndianOil One App) ద్వారా సులభంగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. లేదా నేరుగా మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ కేంద్రాన్ని సందర్శించి, బయోమెట్రిక్ ద్వారా చేయించుకోవచ్చు. అంతేకదండీ, మీ ప్రాంతానికి వచ్చే గ్యాస్ డెలివరీ సిబ్బంది ద్వారా కూడా ఈ-కేవైసీ పూర్తి చేసుకునే వెసులుబాటును కల్పించారు.

కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మార్చి 2026 నుంచి ఈ ఆధార్ బయోమెట్రిక్ ఈ-కేవైసీని తప్పనిసరి చేశారు. ఒకవేళ మీరు ఇప్పటికే ఈ-కేవైసీ పూర్తి చేసి ఉంటే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ, ఇప్పటివరకు చేయని వారు మాత్రం వెంటనే పూర్తి చేసి, మీ గ్యాస్ సబ్సిడీని కాపాడుకోండి. లేదంటే భారీ ధర చెల్లించాల్సి వస్తుంది.