సియా గోయల్.. ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో మారుమోగింది. ప్రియుడితో సెటిల్ అవడం కోసం కాబోయే భర్తను లోయలోకి తోసి చంపేసిన ఈ మహా నటి ఇంకా చాలానే చేసింది. సియా గోయల్ చేసిన పాపాలు రోజుకొకటి బయటికొస్తున్నాయి. కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే.. సియా గోయల్ పెళ్లి షాపింగ్ పేరుతో కేతన్ అగర్వాల్ నుంచి కోటి రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. ఆ డబ్బును తన ప్రియుడైన చేతన్ చౌదరికి ఇచ్చింది.
ఈ డబ్బుతో కెరీర్ సెట్ చేసుకోమని, బిజినెస్ ప్లాన్ చేసుకోమని చెప్పి చేతన్కు సియా ఈ కోటి రూపాయలు ఇచ్చింది. లోయలో నుంచి పొరపాటున కిందపడిపోయాడని పోలీసులను, కేతన్ ఫ్యామిలీని నమ్మించాలని సియా ప్రయత్నించింది. ఆమె అనుకున్న విధంగా అందరూ నమ్మేసి ఉంటే.. ఎవరికీ డౌట్ రాకుండా ఉండేందుకు మూడేళ్ల దాకా ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని పెళ్లి చేసుకోకూడదని ఆమె ప్లాన్ చేసింది. ఈ లోపు.. గోయల్ కుటుంబం కూడా కూతురి జీవితం అలా మోడుబారిపోకూడదని ఆమెకు పెళ్లి చేయాలనే ఆలోచనకు వస్తారని సియా భావించింది.
మూడేళ్లు గడిచిపోతే కేతన్ అగర్వాల్ కుటుంబం నుంచి కూడా సియా గోయల్ పెళ్లికి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కావని ఆమె అంచనా వేసింది. ఇలా అన్నీ తనకు కలిసొస్తే.. మూడేళ్ల తర్వాత ప్రియుడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వొచ్చనేది సియా ప్లాన్. కానీ.. ఆమె పాచిక పారలేదు. ఆమెనే హత్య చేసి చంపిందని ఆధారాలు పక్కాగా ఉండటంతో సియా గోయల్ అరెస్ట్ అయి కాబోయే భర్తను చంపిన కేసులో జైలు ఊచలు లెక్కబెడుతున్న సంగతి తెలిసిందే.
ALSO READ : మీకు తెలుసా ఈ రహస్యం
కేతన్ అగర్వాల్ను హత్య చేసే 34 నిమిషాల ముందు కూడా సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరితో సీక్రెట్ కాల్ మాట్లాడినట్లు ఆమె కాల్ డీటైల్స్ రికార్డ్తో స్పష్టమైంది. మే నెలాఖరులోనే కేతన్ అగర్వాల్ హత్యకు సియా గోయల్ ప్లాన్ చేసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. అప్పుడు ప్లాన్ ఫెయిల్ అయింది. జూన్ 18న రెండో ప్రయత్నంలో కేతన్ అగర్వాల్ను సియా గోయల్ కొండపై నుంచి లోయలోకి తోసి చంపేసింది.
