తెలంగాణ ప్రీమియర్ లీగ్‎కు ఫ్యాన్స్క్యూ.. కిటకిటలాడిన ఉప్పల్ స్టేడియం

తెలంగాణ ప్రీమియర్ లీగ్‎కు ఫ్యాన్స్క్యూ.. కిటకిటలాడిన ఉప్పల్ స్టేడియం

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఉప్పల్‌‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్​ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తెలంగాణ ప్రీమియర్ లీగ్ కు క్రికెట్​ ఫ్యాన్స్​క్యూ కడుతున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఐపీఎల్​మ్యాచ్​ తరహాలో స్టేడియం కిక్కిరిసిపోయంది. కరీంనగర్ డైమండ్స్, వరంగల్ వారియర్స్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగడంతో ఈలలు, కేకలతో దద్దరిల్లింది. కరీంనగర్ డైమండ్స్ 209 రన్స్​చేయగా, వరంగల్ వారియర్స్ 20 ఓవర్లలో 207 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.