ఇరాన్ ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన.. అమెరికా సైనికులను పట్టుకున్నా.. చంపేసినా.. 30 వేల డాలర్ల రివార్డు

ఇరాన్ ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన.. అమెరికా సైనికులను పట్టుకున్నా.. చంపేసినా.. 30 వేల డాలర్ల రివార్డు

టెహ్రాన్: ఇరాన్, అమెరికా యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. అమెరికా సైనికులను పట్టుకున్నా.. చంపేసినా.. 30 వేల డాలర్ల రివార్డు ఇవ్వనున్నట్టు ఇరాన్ ప్రకటించింది. ఒకవేళ ఈ పనిని ఒక మహిళ చేస్తే.. ఆ బహుమతి రెట్టింపు చేస్తామని ఇరాన్ చేసిన ప్రకటన అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ ఆర్థిక సహాయంలో పాలుపంచుకోవడానికి అనేక అభ్యర్థనలు వచ్చిన క్రమంలో ఈ ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నట్లు ఇరాన్ సైన్యాధిపతి అమీర్ హతామి చెప్పినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఎ వెల్లడించింది. 

ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఇరాన్పై దాడి చేయడంతో ఫిబ్రవరి 28న ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం మొదలైంది. దాదాపు 40 రోజుల యుద్ధం తర్వాత ఏప్రిల్లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ తర్వాత శాంతి చర్చల కోసం జూన్లో ముసాయిదా కూడా రూపొందించారు. కానీ అది విఫలమైంది. అప్పటి నుంచి ఇరాన్, అమెరికా అడపాదడపా కాల్పులు జరుపుకుంటున్నాయి. అయితే ఇటీవల ఈ యుద్ధం దక్షిణ ఇరాన్, హెూర్ముజ్ జలసంధి చుట్టూ కేంద్రీకృతమై సాగుతుండటం గమనార్హం.