విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం’. జులై 3న సినిమా రిలీజ్ సందర్భంగా హీరోయిన్ నభా నటేష్ సినిమా విశేషాల గురించి మాట్లాడుతూ ‘పార్వతి అనే వేద విద్యార్థినిగా కనిపిస్తా. ప్రేమ కోసం, ఫ్యామిలీ కోసం ఎంతవరకైనా నిలబడే ఎమోషనల్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇప్పటివరకూ చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నమైన పాత్ర ఇది. సస్పెన్స్‌తో పాటు ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యేలా ఈ క్యారెక్టర్ ఉంటుంది.
అభిషేక్ గారు ప్రతి సీన్‌కు స్టోరీబోర్డ్‌తో పాటు నటీనటుల యాక్షన్, రియాక్షన్స్, కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ లాంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా డీటెయిల్‌గా డిజైన్ చేశారు. నా పాత్ర కోసం రెడీ అవ్వడానికి దాదాపు రెండు గంటలు పట్టేది. షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశా. ఇక పది భారీ సెట్లు వేశారు. ప్రతి సెట్ దేనికదే డిఫరెంట్‌గా ఉంది. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్‌లో షూట్ చేసేటప్పుడు నియమనిష్టలతో పని చేశాం. పూర్తి శాకాహారులుగా ఉన్నాం.
ఇలాంటి ఓ భారీ చిత్రంలో నటించడం గొప్ప అనుభవం. 'నమోరే' పాటతో పాటు మరో జానపద గీతంలో కనిపిస్తా. ఈ రెండు పాటలు విజువల్‌గా చాలా గ్రాండ్‌గా ఉంటాయి. వీఎఫ్‌ఎక్స్ వర్క్ చాలా కొత్తగా రియల్‌గా అనిపిస్తుంది. విరాట్ కర్ణకు ఇది రెండో సినిమానే అయినా అనుభవం ఉన్న నటుడిలా నటించారు.
తన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాతలకు తొలిచిత్రమే అయినా కంటెంట్‌పై నమ్మకంతో దాదాపు రూ.110 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రమోషన్స్ కూడా చాలా వినూత్నంగా చేశారు. టీమ్ వర్క్‌తో ఏదైనా సాధించవచ్చని ఈ సినిమాతో నేర్చుకున్నా’ అని చెప్పింది.
