మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రామాలయాన్ని సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు సందర్శించారు. ఆలయ అర్చకులు జనార్దనాచార్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, భక్తులు రామాలయం, మృత్యుంజయస్వామి ఆలయాల అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎంకు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మధిర మున్సిపల్ కమిషనర్ ఇజ్రాయిల్ పాల్, నాయకులు పాల్గొన్నారు.
