ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ.. ఖమ్మం.. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో అర్జీలు స్వీకరణ

ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ.. ఖమ్మం.. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో  అర్జీలు స్వీకరణ

భద్రాద్రికొత్తగూడెం/ కాశీబుగ్గ/ ములుగు/ జనగామ అర్బన్/ భీమదేవరపల్లి/ ఖమ్మం టౌన్, వెలుగు: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ఆయా కలెక్టరేట్లలో నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.​ వరంగల్​ కలెక్టరేట్​లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్​ సత్యశారద ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ములుగు కలెక్టరేట్​లో మొత్తం 81 అర్జీలు వచ్చాయని అడిషనల్​ కలెక్టర్​ సీహెచ్.మహేందర్​ జీ పేర్కొన్నారు. ​

జనగామలో అత్యధికంగా 401 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​ సందీప్​కుమార్​ ఝా తెలిపారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​కు చెందిన 40 మంది రైతులు కలెక్టర్​ చాహత్​బాజ్​పాయ్​ని కలిసి గౌరవెల్లి ప్రాజెక్ట్​ద్వారా భూములు కోల్పోతున్నామని పెరిగిన మార్కెట్​ వ్యాల్యూకి తగ్గట్టుగా పరిహారం అందించాలని వినతి పత్రం అందజేశారు. భద్రాద్రికొత్తగూడెంలో కలెక్టర్​ అంకిత్, ఖమ్మం కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.