జనగణనలో 40 ప్రశ్నలు ఇవే : కులం, ఆధార్, కరోనా వ్యాక్సిన్ తో సహా మొత్తం డేటా రెడీ చేసుకోండి.. !

జనగణనలో 40 ప్రశ్నలు ఇవే : కులం, ఆధార్, కరోనా వ్యాక్సిన్ తో సహా మొత్తం డేటా రెడీ చేసుకోండి.. !

దేశంలో జన గణన ప్రారంభం కాబోతున్నది. 2027 జనాభా లెక్కల కోసం.. జనం నుంచి సేకరించాల్సిన సమాచారానికి సంబంధించి 40 ప్రశ్నలు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. స్వతంత్ర భారదేశ చరిత్రలో తొలిసారి.. జన గణనతోనే.. కుల గణన చేపడుతుంది ప్రభుత్వం. మొత్తం డేటాను ఆన్ లైన్ చేయటం ఇదే. 

2026 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు.. అంటే మరో 15 రోజుల్లో దేశంలోని లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంఖండ్ ప్రాంతాల్లో మంచుతో కప్పబడి.. తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉండే ప్రాంతాల్లో ప్రారంభం కాబోతున్నది. ఆగస్ట్ 17వ తేదీ నుంచి 31వ తేదీ ఆయా ప్రాంతాల్లోని జనం.. తమ వివరాలను ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆయా ప్రాంతాల్లో వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఈ 40 ప్రశ్నలతో జన గణన చేయబోతున్నారు. భారతదేశ చరిత్రలో అతిపెద్ద జన, కుల గణన ఇదే కావటంతో.. అందరిలో ఆసక్తి నెలకొంది. 

ALSO READ : మాల్యా నుంచి రూ.15 వేల కోట్లు రికవరీ? 

జన, కుల గణనలో 40 ప్రశ్నలు ఇవే : 

1. మీ పేరు ఏమిటి?
2. కుటుంబ పెద్దతో మీకు ఎలాంటి సంబంధం ఉంది?
3. మీ లింగం ఏమిటి? (పురుషుడు/స్త్రీ/ఇతర)
4. మీ పుట్టిన తేదీ మరియు పూర్తి సంవత్సరాలలో మీ వయస్సు ఎంత?
5. మీ ప్రస్తుత వైవాహిక స్థితి ఏమిటి?
6. వివాహం జరిగినప్పుడు మీ వయస్సు (పూర్తయిన సంవత్సరాలలో) ఎంత?
7. మీ జీవిత భాగస్వామి పేరు ఏమిటి?
8. మీరు ప్రకటించుకున్న జాతీయత ఏమిటి?
9. మీ మతం ఏమిటి?
10. మీరు షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST) లేదా మరేదైనా కులానికి చెందినవారా?

11. మీ నాన్నగారి పేరు మరియు వివరాలు ఏమిటి?
12. మీ అమ్మగారి పేరు మరియు వివరాలు ఏమిటి?
13. మీరు ఏదైనా వైకల్యంతో బాధపడుతున్నారా?
14. మీ మాతృభాష ఏమిటి మరియు మీకు తెలిసిన ఇతర భాషలు ఏమిటి?
15. మీ అక్షరాస్యత మరియు డిజిటల్ అక్షరాస్యత (కంప్యూటర్/మొబైల్ వాడకం) స్థితి ఏమిటి?
16. మీరు ప్రస్తుతం ఏదైనా విద్యా సంస్థలో చదువుతున్నారా?
17. మీ అత్యున్నత విద్యా అర్హత ఏమిటి మరియు మీ సబ్జెక్ట్/స్ట్రీమ్ ఏమిటి?
18. మీరు గత ఏడాది కాలంలో ఎప్పుడైనా ఆర్థిక సంబంధిత పనులు చేశారా?
19. మీ ఆర్థిక కార్యకలాపం ఏ వర్గం కిందకు వస్తుంది?
20. మీ ప్రధాన వృత్తి లేదా ఉద్యోగం ఏమిటి?

21. మీ పని/వ్యాపారం యొక్క స్వభావం ఏమిటి – పరిశ్రమ, వాణిజ్యం లేదా సేవ?
22. మీ పని ఆధారంగా మీ తరగతి/వర్గం ఏమిటి? (ఉదా. యజమాని, ఉద్యోగి, స్వయం ఉపాధి పొందుతున్నవారు, మొదలైనవి)
23. మీకు ఉద్యోగం లేదా వ్యాపారం లేకపోతే, మీరు రోజంతా ప్రధానంగా ఏమి చేస్తారు?
24. మీరు ఉద్యోగం చేయకపోతే, మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా లేదా ఉద్యోగం చేయడానికి అందుబాటులో ఉన్నారా?
25. మీరు మీ కార్యాలయానికి ఎలా ప్రయాణిస్తారు మరియు ఎంత దూరం ప్రయాణిస్తారు?
26. మీ జన్మస్థలం ఎక్కడ?
27. ఈ ప్రదేశానికి ముందు మీరు నివసించిన చివరి ప్రదేశం ఏది?
28. నివాసం మార్చడానికి (వలస) ప్రధాన కారణం ఏమిటి?
29. మీరు చివరిసారి నివాసం మార్చినప్పటి నుండి ఈ గ్రామంలో/నగరంలో ఎంతకాలంగా నివసిస్తున్నారు?

30. మీ శాశ్వత నివాస చిరునామా ఏమిటి?
31. ప్రస్తుతం జీవించి ఉన్న పిల్లలు ఎంతమంది? (వివాహిత, వితంతువు లేదా విడాకులు తీసుకున్న మహిళలకు మాత్రమే)
32. మీకు పుట్టిన వెంటనే బతికి బయటపడిన పిల్లలు ఎంతమంది ఉన్నారు? (వివాహిత, వితంతువు లేదా విడాకులు తీసుకున్న మహిళలకు మాత్రమే)
33. గత సంవత్సరంలో మీరు ఎంత మంది పిల్లలకు జన్మనిచ్చారు? (వివాహిత మహిళలకు మాత్రమే)
34. మీరు కోవిడ్-19 టీకా ఎక్కడ వేయించుకున్నారు?
35. మీకు మొత్తం ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి?
36. మీ మొబైల్ నంబర్ ఏమిటి? (అందుబాటులో ఉంటే)
37. మీ ఆధార్ నంబర్ ఏమిటి? (అందుబాటులో ఉంటే)
38. మీ ఓటరు గుర్తింపు సంఖ్య ఏమిటి? (అందుబాటులో ఉంటే)
39. మీ పాస్‌పోర్ట్ నెంబర్ ఏమిటి? (మీరు భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నట్లయితే)
40. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా?

ఈసారి జన గణన మొత్తం డిజిటల్ రూపంలో జరగబోతున్నది. ఆన్ లైన్ ద్వారా సొంతంగా ఫారాలు పూరించొచ్చు లేదా ఇంటికి వచ్చే వాలంటీర్లకు సమాచారం ఇవ్వొచ్చు. జన గణనలో కులం వివరాలు, ఆధార్, మొబైల్ నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది.