భద్రాద్రికొత్తగూడెం/ ములకలపల్లి, వెలుగు : అర్హత కలిగిన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా చూడాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్లో పలు శాఖల ఆఫీసర్లతో సోమవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.
బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటరు వివరాల సేకరణ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు నిర్ణీత గడువులోగా వాటిని సేకరించాలే చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డీఎంహెచ్‌వో తుకారాం రాథోడ్‌తో కలిసి నిర్వహించిన వైరల్ హెపటైటీస్ ప్రోగ్రాం జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించి హెపటైటీస్ కేసులను ముందుగానే గుర్తించి చికిత్స అందించే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ములకలపల్లి మండల కేంద్రంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు చోటివ్వకుండా సవరణ చేపట్టాలని సూచించారు. అంనతంర మంగపేట గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.
