అమెరికా బర్త్ రైట్ సిటిజన్ షిప్పై US సుప్రీం కోర్టు కీలక తీర్పు

అమెరికా బర్త్ రైట్ సిటిజన్ షిప్పై US సుప్రీం కోర్టు కీలక తీర్పు

అమెరికా బర్త్ రైట్ సిటిజన్ షిప్పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను US సుప్రీం కోర్టు కొట్టిపారేసింది. బర్త్ రైట్ సిటిజన్ షిప్ను రద్దు చేసేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నానికి వ్యతిరేకంగా తీర్పునిస్తూ.. అమెరికా సుప్రీంకోర్టు జన్మహక్కు పౌరసత్వ సూత్రాన్ని సమర్థించింది.

దేశంలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక ప్రాతిపదికన నివసిస్తున్న తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరించేందుకు ఉద్దేశించిన ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వును కోర్టు తిరస్కరించింది. 

US సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ తన పదవీకాలంలో చివరి రోజైన మంగళవారం నాడు.. అమెరికా గడ్డపై జన్మించిన దాదాపు ప్రతి ఒక్కరికీ అమెరికా పౌరసత్వ హక్కును కొనసాగించాలని 6-3 ఓట్లతో తీర్పునివ్వడం గమనార్హం.

"చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలికంగా అమెరికాలో నివసిస్తున్న తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన పిల్లలు అమెరికా 'అధికార పరిధికి లోబడి ఉంటారు' మరియు 14వ సవరణలోని పౌరసత్వ నిబంధన ప్రకారం పుట్టుకతోనే అమెరికా పౌరులు అవుతారు," అని రాబర్ట్స్ రాశారు.

►ALSO READ | వెనుజువెలాలో భారత నావికుడి మిస్టరీ డెత్.. బాడీలో ఒక్క ఆర్గాన్ లేదు..పోస్ట్‌మార్టమ్ లో బయటపడిన షాకింగ్ నిజాలు!

"అప్పటికీ, ఇప్పటికీ పౌరసత్వం అంటే హక్కులను కలిగి ఉండే హక్కు, మన రాజకీయ సమాజంలో స్వేచ్ఛగా పాల్గొనే హక్కు. 14వ సవరణ రూపకర్తలు ఆ వాగ్దానాన్ని ఈ దేశంలోని 'ప్రతి స్వేచ్ఛగా జన్మించిన వ్యక్తికి' విస్తరించారు. మనం ఈ రోజు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నాము," అని ఆయన రాశారు.

  • అమెరికా సుప్రీంకోర్టులో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ
  • బర్త్ రైట్ సిటిజన్ షిప్పై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
  • 6-3 మెజారిటీతో కొట్టివేసిన సుప్రీం కోర్టు
  • దీంతో అమెరికాలో జన్మించిన పిల్లలకు, వారి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా/ శాశ్వత నివాసితులు కాకపోయినా, రాజ్యాంగం కల్పించిన పౌరసత్వ హక్కు కొనసాగుతుందని స్పష్టం చేసిన కోర్టు
  • ఈ ఏడాది ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి ఈ తీర్పు రెండో ఎదురుదెబ్బ
  • ఫిబ్రవరిలో ట్రంప్ టారిఫ్ విధానానికి సంబంధించిన కీలక చర్యను కూడా చెల్లదని ప్రకటించిన కోర్టు