‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్‌‌రాజ్‌‌, డెలివరీ బాయ్‌‌ మధ్య గొడవ

‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్‌‌రాజ్‌‌, డెలివరీ బాయ్‌‌ మధ్య గొడవ
  •      గొడవను వీడియో తీసి సోషల్​మీడియాలో డెలివరీ బాయ్​ పోస్ట్​ 
  •     మర్నాడు హీరో కారుపై దాడికి యత్నం 

గచ్చిబౌలి, వెలుగు: ‘రాజు వెడ్స్​రాంబాయి’​ హీరో అఖిల్‌‌రాజ్‌‌, జెప్టో డెలివరీ బాయ్ గొడవ సోషల్​మీడియాలో వైరల్‌‌గా మారింది. వేరే ఇంట్లో ఇవ్వాల్సిన డెలివరీని హీరో ఇంట్లో ఇవ్వడంపై ఈ గొడవ మొదలైంది. ఈక్రమంలో మంగళవారం తన తల్లిదండ్రులతో కలిసి కారులో గుడికి వెళ్తున్న అఖిల్‌‌రాజ్‌‌పై కొందరు డెలివరీ బాయ్స్​ రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌‌ కొండాపూర్​ రాఘవేంద్ర కాలనీలోని అరుణ రెసిడెన్సీలో 201 ఫ్లాట్‌‌లో అఖిల్‌‌రాజ్​ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. 

సోమవారం డెలివరీ బాయ్​ రమేశ్‌‌ ‘మీటిగో’ యాప్‌‌ ద్వారా బుక్‌‌ చేసిన నాన్‌‌వెజ్‌‌ ఐటెంను చేలం రెసిడెన్సీలోని 201లో ఇవ్వాల్సి ఉండగా.. అరుణ రెసిడెన్సీలోని అఖిల్‌‌రాజ్ ఇంట్లో ఇచ్చాడు. దీనిపై అఖిల్‌‌రాజ్‌‌కు రమేశ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం జరుగుతుండగా డెలివరీ బాయ్​ తీసిన వీడియో సోషల్​ మీడియా పోస్ట్​ చేయడంతో వైరల్‌‌గా మారింది. మర్నాడు అఖిల్‌‌రాజ్‌‌ తన తల్లిదండ్రులతో కలిసి కారులో గుడికి వెళ్తుండగా.. ఒక్కసారిగా డెలివరీ బాయ్స్​ రాళ్లతో దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దాడికి యత్నించిన డెలివరీ బాయ్​ రమేశ్‌‌, అతని స్నేహితుడు సందీప్​తోపాటు మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.