లోహగఢ్ కోటకు టూరిస్టుల రద్దీ.. కేతన్ మర్డర్ స్పాట్ చూడ్డానికి భారీగా జనం

లోహగఢ్ కోటకు టూరిస్టుల రద్దీ.. కేతన్ మర్డర్ స్పాట్ చూడ్డానికి భారీగా జనం

పుణె: మహారాష్ట్రలోని లోహగఢ్​కోటలో పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యకు గురైన విషయం తెలిసిందే. కేతన్‏కు కాబోయే భార్య సియా అతడిని లోయలోకి తోసేసి చంపేసిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ కేసు పుణెతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో లోహగఢ్​కోటకు పర్యాటకుల రద్దీ పెరిగింది. టూరిస్టుల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగిందని ఫోర్ట్​ నిర్వాహకులు చెబుతున్నారు. 

కేతన్‎ను సియా తోసివేసిన ప్రదేశాన్ని చూడాలనే ఉత్సాహంతో జనం భారీ సంఖ్యలో వస్తున్నారని పేర్కొన్నారు. కాగా, సియా ప్రవర్తనను చూసి కేతన్ ఆమెకు మరొకరితో అఫైర్ ఉందని అనుమానించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. హత్యకు ముందు సియా ప్రవర్తనపై కేతన్ తన తండ్రి వద్ద అనుమానం వ్యక్తం చేశాడు.

ఆమె తరచూ చేతన్ పేరును ప్రస్తావించడం, ఫోన్ ఎప్పుడూ బిజీగా ఉండడం, చిన్న విషయానికే గొడవ పడడం వంటి అంశాలను కేతన్ తన తండ్రి దృష్టికి తీసుకెళ్లాడు. ఆమె బ్యాక్ గ్రౌండ్ సరిగ్గా విచారించారా అని పలుమార్లు ప్రశ్నించినట్లు తాజాగా బయటపడింది. అయితే, సియాకు నచ్చచెబుతానని సర్దిచెప్పి ఎంగేజ్​మెంట్ జరిపించామని, అదే కొడుకు ప్రాణం తీసిందని కేతన్ తండ్రి వాపోతున్నారు.

సియా బ్రదర్‎పై రూ.10 కోట్ల దావా

ఈ కేసులో న్యాయపరమైన చిక్కులు మొదలయ్యాయి. నిందితురాలు సియా గోయల్ తరపున వాదించే విషయంలో ఇద్దరు న్యాయవాదుల మధ్య గొడవ మొదలైంది. తానే సియా లాయర్‎నని అశుతోష్ శ్రీవాస్తవ వాదిస్తున్నారు. అయితే, సియా ఫ్యామిలీ దీనిని ఖండించింది.

 సియా సంతకాన్ని ఆయన మోసపూరితంగా సేకరించాడని సియా సోదరుడు ఆరోపించాడు. దీంతో తన వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగిందని అశుతోశ్ శ్రీవాస్తవ ఆరోపిస్తూ సియా సోదరుడికి రూ.10 కోట్లకు పరువు నష్టం దావా నోటీసులు పంపించాడు.

మరిన్ని వార్తలు