సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి..హెచ్సీయూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల ధర్నా

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి..హెచ్సీయూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల ధర్నా
  •     ఎస్ఎఫ్ఐ వర్సిటీ యూనిట్ సంఘీభావం 

గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్​సెంట్రల్​యూనివర్సిటీ(హెచ్​సీయూ)లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి, సమాన పనికి సమాన వేతం ఇవ్వాలని కార్మికులు డిమాండ్​చేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని యూనివర్సిటీలో మంగళవారం ఉదయం ధర్నా చేపట్టగా.. ఎస్ఎఫ్ఐ వర్సిటీ యూనిట్ సంఘీభావం తెలిపింది.

నాయకులు మాట్లాడుతూ.. కార్మికులకు ఉద్యోగ భద్రత,  సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు, ఓవర్ టైమ్ కు తగిన పారితోషికం ఇవ్వాలని, ఆరోగ్య బీమా అమలు చేయాలని కోరారు.