ప్రభుత్వ భూకబ్జాకు యత్నం.. రాత్రి ట్రాక్టర్తో రెండెకరాల భూమి చదును 

 ప్రభుత్వ భూకబ్జాకు యత్నం.. రాత్రి ట్రాక్టర్తో రెండెకరాల భూమి చదును 

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ శివారులో మైనార్టీ స్కూల్ భవనానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆనుకుని సర్వే నెం.156 లో ఉన్న రెండెకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ట్రాక్టర్​తో దున్నడం కలకలం రేపింది.  

ఇక్కడ భూముల విలువ పెరగడంతో కబ్జాదారులు ప్రభుత్వ భూములపై కన్నేశారు. ఈ కబ్జా వెనుక స్థానిక నాయకుల హస్తం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కబ్జా విషయాన్ని బెల్లంపల్లి తహసీల్దార్​ఎల్.కృష్ణ దృష్టికి తీసుకెళ్లగా భూమిని దున్నిన ప్రాంతాన్ని ఆర్ఐ పరిశీలించారని, విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.