రైల్వేలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్: మొత్తం 6,557 పోస్టులు.. డిగ్రీ, బిటెక్ చేసినోళ్లకు మంచి ఛాన్స్..

రైల్వేలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్: మొత్తం 6,557 పోస్టులు..  డిగ్రీ, బిటెక్ చేసినోళ్లకు మంచి ఛాన్స్..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్ఆర్​బీలు) దేశప్తంగా వివిధ జోనల్ రైల్వేలు, ప్రొడక్షన్ యూనిట్లలో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,557 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-–I (సిగ్నల్) తోపాటు 24 రకాల విభిన్న కేటగిరీలకు చెందిన టెక్నీషియన్ గ్రేడ్–-III పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు అధికారిక ఆర్‌ఆర్‌బీ వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ జూన్ 30న ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జులై 29. 

పోస్టులు: టెక్నీషియన్ గ్రేడ్-–I  సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-–-III (24 క్యాటగిరీలు). 

మొత్తం ఖాళీలు: 6557.

క్యాటగిరీ వారీగా ఖాళీలు: అన్ రిజర్వ్డ్ 2728, ఓబీసీ 1565, ఎస్సీ 1009, ఈడబ్ల్యూఎస్ 658, ఎస్టీ 597, ఎక్స్ సర్వీస్ మన్ 661. 

ఎలిజిబిలిటీ
టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సంబంధిత స్ట్రీమ్స్​లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా బీఈ/ బి.టెక్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

టెక్నీషియన్ గ్రేడ్-III (సిగ్నల్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతితోపాటు ఎన్​సీవీటీ/ ఎస్ సీవీటీ నుంచి ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ (సీసీఏఏ) పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి
టెక్నీషియన్ గ్రేడ్-I  సిగ్నల్: 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి.
టెక్నీషియన్ గ్రేడ్-III   సిగ్నల్: 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎక్స్  సర్వీస్​మెన్ అభ్యర్థులకు ప్రస్తుత వయసు నుంచి వారు సైన్యంలో అందించిన సేవా కాలాన్ని మినహాయించిన తర్వాత వారి కేటగిరీని బట్టి అదనపు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 30. 

అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్/ జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్​మెన్, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్ జెండర్లు, మైనార్టీలు, ఈబీసీలకు రూ.250. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన వారికి అప్లికేషన్ ఫీజును రీఫండ్ చేస్తారు.  

లాస్ట్ డేట్: జులై 29. 

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ rrb.indianrailways.gov.inను సందర్శించండి. 

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 
ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే రాతపరీక్ష (సీబీటీ) పూర్తిగా మల్టిపుల్ ఛాయిస్ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. గ్రేడ్–I, గ్రేడ్–III పోస్టులకు విడివిడిగా వేర్వేరు సిలబస్‌లతో పరీక్షలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 90 నిమిషాల్లో ఎగ్జామ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కులు కోత విధిస్తారు.