వాషింగ్ మెషీన్ ను బాల్కనీలో పెడితే సురక్షితమేనా? ..మెషీన్ ఎక్స్ పర్ట్స్ ఏంచెబుతున్నారంటే

వాషింగ్ మెషీన్ ను బాల్కనీలో పెడితే సురక్షితమేనా? ..మెషీన్ ఎక్స్ పర్ట్స్ ఏంచెబుతున్నారంటే

వాషింగ్ మెషీన్ .. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఫ్రంట్ డోర్, టాప్ డోర్ ఇలా రకరకాల వాషింగ్ మెషీన్లు, రకరకాల బ్రాండ్లలో లభిస్తున్నాయి. ప్రస్తుత ఉరుకులు పరుగుల లైఫ్ లో బట్టలు ఉతికేందుకు సులభమైన మార్గంగా వాషింగ్ మెషీన్లు వాడుతున్నారు.  ఇదంతా బాగానే ఉంది. కానీ వాషింగ్ మెషీన్ ను ఇంట్లో ఎక్కడ పెట్టాలి, దాని మెయింటెనెన్స్ ఎలా చేయాలి వంటి విషయాలను చాలా మంది లైట్ తీసుకుంటారు.   ఎక్కువ శాతం మంది వాషింగ్ మెషీన్లను బాల్కనీలో పెడుతుంటారు..ఇది సురక్షితమేనా.. ? సౌకర్యవంతమేనా..? వాషింగ్ మెషీన్ ఎలా  మెయిటెన్ చేయాలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. 

వాషింగ్ మెషీన్ బాల్కనీలో ఉంటే మంచిదేనా?

 వాషింగ్ మెషీన్ వాడే 90 శాతం మంది దాదాపుగా వీటిని బాల్కనీలో పెడుతుంటారు.  మంచిదే.. బాల్కనీలో పెట్టడం  చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం,వాషింగ్ మెషీన్ నుంచి వచ్చే వాటర్ బయటికి వెళ్లేందుకు సరైన ప్లేస్. కానీకొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే మెషీన్ ఎక్కువ కాలం మన్నిక రాకుండా  పాడయిపోయే అవకాశం ఉంది.

బాల్కనీలో వాషింగ్ మెషీన్ ఉంచినప్పుడు సూర్యరశ్మీ ,దుమ్ము ,వర్షం ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మెషీన్ పాడయిపోయి ఎక్కువ కాలం మన్నిక ఉండదు. సూర్యరశ్మీ పడే చోట ఉంచితే వేడికి అందులోని ప్లాస్టిక్ వస్తువులు బలహీనంఅవుతాయి. రంగు మారుతుంది. ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్ తలెత్తుంది. మెషీన్ లైఫ్ టైమ్ తగ్గుతుంది. అదేవిధంగా  దుమ్ము వల్ల మోటార్ , ఫిల్టర్లు బ్లాక్ అయి పోతాయి. దీంతో సౌండ్, వైబ్రేషన్ పెరుగుతుంది.పర్మార్మెన్స్ తగ్గుతుంది. 

ALSO READ : జులైలో బ్యాంకు పనులు ముందే పూర్తి చేసుకోండి.. 

ఇకవర్షంలో తడిస్తే షార్ట్ సర్క్యూట్ కావొచ్చు.మెషీన్ తుప్పు పట్టవచ్చు.మోటార్ కాలిపోవచ్చు. ఎలక్ట్రిక్ పార్టులుడ్యామేజ్ కావొచ్చు. మెషీన్ లోపల బూజురావొచ్చు. మొత్తంగా వాషింగ్ మెషీన్  డ్యామేజ్ తో లైఫ్ టైం తగ్గవచ్చు. కాబట్టి బాల్కనీలో వాషింగ్ మెషీన్ ఉంచినా తగు జాగ్రత్తులు తీసుకోవాలి.