రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ప్రస్తుతం రోజురోజుకూ పడిపోతున్న బంగారం, వెండి రేట్లను ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలతో బులియన్ మార్కెట్లకు అటు పెట్టుబడిదారుల నుంచి ఇటు రిటైల్ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ భారీగా పడిపోవటమే ప్రస్తుత పరిస్థితులకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో షాపింగ్ చేద్దాం అనుకునే తెలుగు ప్రజలు ముందుగా తమ నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలించటం బెటర్.
జూన్ 30న బంగారం రేట్లు తగ్గాయి. జూన్ 29 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.180 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 013గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 845గా కొనసాగుతోంది.
మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 30, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 45వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.245 దగ్గర ఉంది.
