భారత్‌‌‌‌ గౌరవ్ టూరిస్ట్ రైళ్లలో కాశీ, అరుణాచలయాత్ర... జులై 4, 20న బయలుదేరనున్న రైళ్లు

భారత్‌‌‌‌ గౌరవ్ టూరిస్ట్ రైళ్లలో  కాశీ, అరుణాచలయాత్ర... జులై 4, 20న బయలుదేరనున్న రైళ్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లలో ఐఆర్‌‌‌‌‌‌‌‌సీటీసీ వైద్యనాథ్, అయోధ్య, కాశీ యాత్రలతో పాటు అరుణాచల యాత్రను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వైద్యనాథ్, అయోధ్య, కాశీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి జులై4న మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు చర్లపల్లి, కాజీపేట్ జంక్షన్, వరంగల్, ఖమ్మంతో పాటు ఏపీలోని పలు స్టేషన్లలో ఆగుతుంది. యాత్ర 10 రోజులు ఉంటుంది. అయోధ్య యాత్రలో విష్ణుపాద ఆలయం, కాశీ విశ్వనాథ్ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయం, గంగా హారతి, రామజన్మ భూమి, హనుమాన్‌‌‌‌గర్హి, త్రివేణి సంగమం, బాబా బైద్యనాథ్ ఆలయ దర్శనాలు ఉంటాయి. 

అరుణాచల యాత్ర ఇలా..

దివ్య దక్షిణ యాత్రకు వెళ్లే రైలు జులై 20 న ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. ఈ రైలుకు చర్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఏపీలోని పలు స్టేషన్లలో హాల్టింగ్​ఉంటుంది. ఈ యాత్ర 9 రోజులపాటు కొనసాగనుండగా.. అరుణాచల ఆలయం, నటరాజ ఆలయం, శ్రీ రంగనాథస్వామి, బృహదీశ్వర, రామనాథస్వామి, మీనాక్షి ఆలయం, రాతి స్మారక చిహ్నం, కుమారి అమ్మవారి ఆలయ దర్శనాలు ఉంటాయి. వివరాలకు www.irctctourism.com సందర్శించాలని అధికారులు తెలిపారు.