మెహిదీపట్నం, వెలుగు: మంగళ్‌హాట్‌కు చెందిన గంగసాగర్మహారాష్ట్ర వెళ్లి, మంగళవారం నగరానికి తిరిగొచ్చాడు. ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. దిగేటప్పుడు 50 గ్రాముల బంగారు ఆభరణాలున్న హ్యాండ్‌బ్యాగ్‌ను ఆటోలో మరిచిపోయాడు.
బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఇంతలోనే ముషీరాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్ సయ్యద్ షబీర్ స్వచ్ఛందంగా స్టేషన్‌కు వచ్చి, ఆ బ్యాగ్‌ను పోలీసులకు అప్పగించాడు. ఆయన నిజాయితీని సీఐ రాఘవేంద్ర, ఎస్సై అనూష అభినందించి, సన్మానించారు.
