హెచ్ పీఎస్ లో ఎస్సీ స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ ..రాష్ట్ర వ్యాప్తంగా లక్కీ డ్రాలో 53 మంది ఎంపిక

హెచ్ పీఎస్ లో ఎస్సీ స్టూడెంట్స్ కి అడ్మిషన్స్ ..రాష్ట్ర వ్యాప్తంగా లక్కీ డ్రాలో 53 మంది ఎంపిక


హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో పేద ఎస్సీ స్టూడెంట్స్ కు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్ పీఎస్) లో అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఒకటో తరగతిలో అడ్మిషన్ కోసం రాష్ర్ట వ్యాప్తంగా పేద ఎస్సీ స్టూడెంట్స్ ను లాటరీ ద్వారా జిల్లా కలెక్టర్లు ఎంపిక చేశారు. మొత్తం 53 మందిని ఎంపిక చేయగా, బేగంపేటలోని హెచ్ పీఎస్ కు 34 మంది, రామంతపూర్ లోని హెచ్ పీఎస్ కు 19 మందిని కేటాయించారు. వీరికి స్కూల్ ఫీజు, వసతి వంటి అన్ని సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది. బుధవారం నుంచి స్టూడెంట్స్ ఆయా స్కూల్స్​లో జాయిన్ అవుతారని ఎస్సీ డిపార్ట్ మెంట్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.