మిథునరాశివారికి జులై 2026 నెల అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వ్యాపార విస్తరణ పనులు చురుగ్గా సాగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన కాలం. మీ మాటకు విలువ పెరుగుతుంది. పదిమందిలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల ( జులై 2026) ఈ రాశి వారికి శుభ గ్రహాల బలం అనుకూలంగా ఉంది. ధన స్థానంలో గురుడి సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలను సాధిస్తాను. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
గ్రహాల సంచారం ఆధారంగా జూలై 2026 నెల మిథున రాశి వారికి రెండు విభిన్నమైన ఫలితాలు ఉంటాయి.వ్యక్తిగత జాతకంలో ద్వితీయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు సంచారం వలన మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే అవకాశాలున్నాయి. అలాగే సమాజంలో గుర్తింపు వస్తుంది. అయితే వ్యయ స్థానంలో (12వ ఇల్లు) కుజుడు ఉండటం వలన అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. . జూలై 7న రాశ్యాధిపతి బుధుడు మీ లగ్నంలోకి రావడం వలన పెద్ద ఊరట కలుగుతుంది. బుధుని తెలివితేటలతో నెగెటివ్ ఆలోచనల నుంచి సులభంగా బయటపడతారని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
జూలై 8 నుంచి 13 మధ్య ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన సమయం. కార్యాలయంలో మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా జూలై 8, 16, 30 తేదీలు వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత అనుకూలమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఉద్యోగస్తుల జీవితాలకలో కొద్దిపాటి మార్పులు కలిగే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తాయి. జాబ్మారాలనుకొనే వారికి ఈ నెల చాలాఅనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు అందుకుంటారు. పెళ్లి కోసంఎదురు చూసే వారికి బంధు వర్గంలోని వారితో సంబంధం కుదురుతుంది, కుటుంబ జీవితం... ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
