బెంగళూరు - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యాన్ని మరింత పెంచేందుకు గాను.. రెండు నగరాల మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్, నాన్-ఏసీ బస్సుల బోర్డింగ్ , అలైటింగ్ పాయింట్లను భారీగా పెంచినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.ఇకపై ప్రయాణికులు తమకు నచ్చిన, దగ్గర్లోని ప్రాంతాల నుంచే సులభంగా బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా రూట్లను క్రమబద్ధీకరించారు.దీనిలో భాగంగా పీనియా రూట్ (via Peenya) లో ప్రయాణించే బస్సుల కోసం బెంగళూరు నగరంలో కొత్త స్టాప్‌ల వివరాలు ఇలా ఉన్నాయి:
- పీనియా (Peenya)
- యశ్వంతపూర్ మెట్రో స్టేషన్ (Yeshwanthpur Metro Station)
- కెంపెగౌడ బస్ స్టేషన్ (మెజెస్టిక్)
- హెబ్బల్ (Hebbal)
- ఎస్టీమ్ మాల్ (Esteem Mall)
- ఎలాహంక (Yelahanka)
- బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా ,దేవనహళ్లి బైపాస్.
కాబట్టి ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు దూరం భారం లేకుండా మీ ఇంటికి దగ్గర్లోనే ఈ పాయింట్స్ దగ్గర సులువుగా బస్సులు ఎక్కవచ్చు లేదా దిగవచ్చు.
2.చందాపూర్ రూట్ (via Chandapura) : చందాపూర్, బొమ్మసంద్ర (Bommasandra), ఎలక్ట్రానిక్ సిటీ (Electronic City), బొమ్మనహళ్లి మెట్రో స్టేషన్, మడివాళ (Madiwala), కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ & ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్.
1. మార్తహళ్లి రూట్ (via Marathahalli): వర్తూర్ జంక్షన్ (Varthur Junction), మార్తహళ్లి, దొమ్లూరు బ్రిడ్జి (Domlur Bridge), కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్ & ఎస్టీమ్ మాల్, ఎలాహంక, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్.
హైదరాబాద్‌లో బోర్డింగ్ & అలైటింగ్ పాయింట్లు
- బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే అన్ని సర్వీసుల ప్రయాణికుల కోసం నగరంలోని ప్రధాన మార్గాల్లో కింది విధంగా స్టాప్‌లు అందుబాటులో ఉంటాయి :
- పటాన్‌చెరు రూట్ : పటాన్‌చెరు నుండి ఎంజీబీఎస్ (MGBS), ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో..
- జేబీఎస్ రూట్: జేబీఎస్ (JBS) నుండి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో..
- హయత్ నగర్ రూట్: హయత్ నగర్ నుండి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీలలో బోర్డింగ్/అలైటింగ్ పాయింట్లు కలవు.
- టీజీఎస్ ఆర్టీసీ కల్పించిన ఈ అద్భుతమైన సదవకాశాన్ని బెంగళూరు - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులందరూ వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. మీ ఇంటికి దగ్గరలోనే బోర్డింగ్ పాయింట్లను ఎంచుకుని, సురక్షితమైన,సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలని యాజమాన్యం సూచించింది.
