మొహాలీలోని ఫోర్టిస్ హాస్పిటల్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక డాక్టర్ ఏకంగా బైక్‌పై హాస్పిటల్ లోనికి వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
విషయం ఏంటంటే... హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం అక్కడ పనిచేసే ప్రముఖ రోబోటిక్ గైనకాలజికల్ సర్జన్ డాక్టర్ మిశ్రా ఒక వెరైటీ ప్లాన్ వేశారు. వేడుకల కోసం డిజైన్ చేసిన స్పెషల్ డ్రెస్ వేసుకుని, హాస్పిటల్ లోపల కారిడార్ నుండి ఒక బైక్ వెనుక సీట్ పై కూర్చుని ఆమె గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అది చూసి అక్కడి సిబ్బంది, గెస్టులు కేకలు వేస్తూ, చప్పట్లతో ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఈ వీడియో కాస్తా బయటకు రావడంతో నెటిజన్లలో పెద్ద చర్చ మొదలైంది. హాస్పిటల్ వాళ్లు ఈ వీడియోను తర్వాత డిలీట్ చేసిన.. అప్పటికే ఇది X, ఫేస్‌బుక్‌లో విపరీతంగా షేర్ అయిపోయింది. ఈ క్రేజీ ఎంట్రీపై సోషల్ మీడియా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేసారు.
కొందరు 25 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న హాస్పిటల్ స్టాఫ్, ఇలా కాస్త ఒత్తిడి పక్కన పెట్టి సరదాగా సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పులేదని చాలా మంది సపోర్ట్ చేస్తూ మెచ్చుకున్నారు.
మరికొందరు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హాస్పిటల్ అనేది రోగులు ప్రశాంతంగా, కోలుకోవడానికి ఉండే చోటని.. ఇలా బైకులు నడపడం, సౌండ్స్ చేయడం వల్ల పేషెంట్లకు ఇబ్బంది కలగదా ? అని ప్రశ్నించారు. పైగా ఇది సేఫ్టీ పరంగా కూడా రిస్క్ కదా అని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, ఇది అందరి సేఫ్టీ దృష్టిలో పెట్టుకుని, కేవలం స్టాఫ్ కోసం ఏర్పాటు చేసిన ఒక కంట్రోల్డ్ ప్రోగ్రామ్‌లో మాత్రమే జరిగిందని హాస్పిటల్ మద్దతుదారులు చెబుతున్నారు.
'3 ఇడియట్స్' సినిమా
ఈ వీడియో చూసిన చాలా మందికి బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా '3 ఇడియట్స్' లోని ఒక సీన్ గుర్తొచ్చింది. అందులో అమీర్ ఖాన్ తన ఫ్రెండ్ వాళ్ల నాన్న ప్రాణాలు కాపాడటానికి స్కూటర్‌ను నేరుగా హాస్పిటల్ లోపలికి నడుపుకుంటూ వెళ్తాడు.
ట్విస్ట్ ఏంటంటే ఆ సినిమాలో ఆ సీన్‌ను షూట్ చేసింది కూడా సరిగ్గా ఇదే ఫోర్టిస్ హాస్పిటల్‌లోనే. దాంతో నెటిజన్లు "అప్పుడు సినిమాలో చూశాం.. ఇప్పుడు రియల్‌గా చూస్తున్నాం" అంటూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.
ఏదేమైనా, ఎప్పుడూ సీరియస్‌గా ఉండే హాస్పిటల్ వాతావరణంలో ఇలాంటి ఒక సీన్ అందరినీ ఆశ్చర్యపరిచింది అనడంలో డౌట్ లేదు!
Strange video uploaded on Facebook by Dr Swapna Mishra of Fortis Mohali’s 25th anniversary celebrations. How can somebody allowed to ride a motorbike inside the hospital? Hope @PunjabPoliceInd @dcmohali take action against such incidents. https://t.co/TTrB8YDlbW pic.twitter.com/L8mcUsYF7d
— Nitin Sharma (@Nitinsharma631) June 30, 2026
