Norway vs Ivory Coast: ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ పోరులో నార్వే జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ (Côte d’Ivoire) జట్టును 2 –1తేడాతో ఓడించి నార్వే రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. 1998 తర్వాత నార్వే జట్టు ప్రపంచకప్‌లో లాస్ట్ 16 రౌండ్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. జూలై 5వ తేదీన జరగబోయే తదుపరి రౌండ్‌లో బ్రెజిల్ జట్టుతో నార్వే తలపడనుంది.
నుసా మెరుపు గోల్.. నార్వేకు లీడ్:
మ్యాచ్ ప్రారంభంలో ఐవరీ కోస్ట్ ప్లేయర్స్ రెండు వైపుల నుంచి దాడులు చేస్తూ నార్వే డిఫెన్స్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. గిస్లైన్ కోనన్ కొట్టిన షాట్ సైడ్ నెటింగ్‌ను తాకగా, నికోలస్ పేపేకు లభించిన గోల్ ఛాన్స్‌ను చేజార్చుకున్నాడు. ఐవరీ కోస్ట్ ఒత్తిడిని అధిగమించిన నార్వే.. ఆంటోనియో నుసా అద్భుత గోల్‌తో మ్యాచ్‌లో ఖాతా ఓపెన్ చేసింది. లెఫ్ట్ వింగ్ నుంచి లోపలికి దూసుకొచ్చిన నుసా, బంతిని నెట్ కార్నర్‌లోకి పంపి టోర్నీలో తన ఫస్ట్ గోల్‌ను నమోదు చేశాడు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి నార్వే 1–0 ఆధికత్యంలో నిలిచింది.
అమద్ డియాలో గోల్ ఆఫ్ ది టోర్నమెంట్:
సెకండ్ హాఫ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన అమద్ డియాలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మొదట నార్వే కొట్టిన షాట్‌ను గోల్-లైన్ వద్ద అద్భుతంగా క్లియర్ చేసిన డియాలో.. ఆ తర్వాతి క్షణంలోనే నికోలస్ పేపేతో కలిసి పాస్‌లు షేర్ చేసుకుంటూ ఇద్దరు నార్వే డిఫెండర్లను ముప్పుతిప్పలు పెట్టి ఒక మైండ్ బ్లోయింగ్ ఈక్వలైజర్ గోల్ సాధించాడు. ఈ టోర్నమెంట్‌లోనే అత్యుత్తమ గోల్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ గోల్‌తో స్కోరు 1–1తో సమమైంది.
క్వార్టర్స్ రేసులో నార్వే:
ఐవరీ కోస్ట్ పుంజుకున్న తరుణంలో నార్వేకు తమ నమ్మకమైన స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ (Erling Haaland) అండగా నిలిచాడు. మ్యాచ్ చివరి దశలో పాట్రిక్ బెర్గ్ అందించిన లో-క్రాస్ బంతిని హాలాండ్ చాలా క్లోజ్ రేంజ్ నుంచి గోల్‌గా మలిచాడు. ఈ టోర్నీలో హాలాండ్‌కు ఇది 5వ గోల్ కాగా, ఇదే నార్వేకు విన్నింగ్ గోల్‌గా నిలిచింది. చివరి నిమిషంలో డియాలో కొట్టిన ఫ్రీ-కిక్‌ను నార్వే గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ అద్భుతంగా సేవ్ చేయడంతో నార్వే గెలిచింది.
#ICYISInaLUCAS | 40’
— IMFURAYACU Jean Luc (@imfuraluc01) June 30, 2026
Gooaaaal Nusa assisted by Odegaard
Ivory Coast 🇨🇮 0-1 🇳🇴 Norway
What A Goaal!
Umwana awukaraze nkureba Pe!
Hamwe na @winner_rw
Kuri @azamtvrw MUKIBONYE GUTE? @BBKIGALIFM 89.7 FM pic.twitter.com/8ZBRXNoSkF
Norway push through to the next round! ⏭️#FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 30, 2026
🎥 Martin Ødegaard leading the Norway squad and fans in the Viking Row after their 2-1 win against Ivory Coast. 🇳🇴 pic.twitter.com/3bsILSMHic
— DailyAFC (@DailyAFC) June 30, 2026
