జ్యోతిష్యం : జులై నెల కర్కాటక రాశి.. ఈ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది..!

జ్యోతిష్యం :  జులై నెల కర్కాటక రాశి.. ఈ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది..!

కర్కాటకరాశి వారికి ఈ నెలలో ( 2026 జులై) సూర్యుడు, గురువు కలవడంతో సమాజంలో  కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లాభ స్థానంలో కుజుడు, ధన స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన ఈ రాశి వారికి  అదృష్టం  ఇంటి తలుపు తడుతుంది. ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతుంది.  ఈ జూలై నెలలోఈ  రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో సవివరంగా తెలుసుకుందాం. . .! 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై నెల కర్కాటక రాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతమవుతుంది.   జూలై 16న సూర్యుడు ఇదే  రాశిలో గురువుతో కలవడం విశేషమైన యోగం కలుగుతుంది. కేతువు సంచారం వలన మానసిక సమస్యలు కలిగే అవకాశం ఉంది. అయితే గురుడి శుభ దృష్టి వలన అనుకోకుండా వచ్చిన ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుంది.

గ్రహాలన్నీ చాలావరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో కూడిన పదోన్నతికి అవకాశం ఉంది.. జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. కుటుంబ జీవితం బాగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగపరంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది.

కర్కాటక రాశిలో జన్మించిన వారికి జూలై నెల ప్రారంభం మరింత శుభప్రదంగా ఉంటుంది.  కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా  జాబ్​ మారడానికి ప్రయత్నిస్తున్న వారు  నెల మొదటి భాగంలో మీరు ఆశించిన విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు, ఈ నెల కొత్త ఉద్యోగ అవకాశాలతో ప్రారంభమవుతుంది. 

ఉద్యోగస్తుల విషయంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోకుండా పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి.  పిల్లల విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది.

ఆర్థిక లాభాలకు ఆటంకం కలిగించే అడ్డంకులు తొలగిపోతాయి. నెల మొదటి భాగం మీ ఆరోగ్యానికి, సంబంధాలకు అత్యంత అనుకూలమైనదిగా పరిగణిస్తారు. ఆదాయం పరంగా జూలై నెల మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది. కుజుడు 11వ ఇంట్లో ఉండి ధన వర్షం కురిపిస్తాడు. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు, షేర్లు లేదా భూములు ఇప్పుడు రెట్టింపు లాభాలను అందిస్తాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.