జ్యోతిష్యం : సింహరాశి వారికి అవకాశాల పండుగ.. జులై నెలలో చేయాల్సిన పరిహారాలు ఇవే..!

జ్యోతిష్యం :  సింహరాశి వారికి అవకాశాల పండుగ.. జులై నెలలో చేయాల్సిన పరిహారాలు ఇవే..!

సింహ రాశి వారికి ఈ నెల ( జులై 2026)  కొత్త అవకాశాల పండుగగా మారనుంది. అన్ని రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.   మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి శుభప్రదమైన నక్షత్రాలు తోడుగా ఉండే అవకాశం ఉంది.  జ్యోతిష్య నిపుణులు తెలిపి న వివరాల ప్రకారం 2026 వ సంవత్సరం జులై నెలలో ఈ రాశి వారికి  ఎలా ఉంటుందో తెలుసుకుందాం...

నాయకత్వ లక్షణాలు సహజంగా ఉండే సింహ రాశికి కొత్త సంవత్సరం(2026)  కొత్త అవకాశాలు పండుగగా మారనుంది. ఈ రాశివారి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఆర్థికం నుంచి ఆరోగ్యం వరకు, సంబంధాల నుంచి కెరీర్ వరకు అన్నింట్లో మీ ప్రతిభ వెలుగులు పంచబోతోంది

 సింహ రాశి వారికి జులై 2026 లో  దశమ స్థానంలో  కుజుడి సంచారం వలన  ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురులేని విజయాలను అందుకుంటారు. ఏ పని చేపట్టినా అందులో నూటికి నూరు శాతం ఫలితం వస్తుంది. అయితే  జన్మ రాశిలో తిష్టవేసిన కేతువు మీలోని ఉత్సాహాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తాడు. . విజయం సాధించినా దానిని ఆస్వాదించలేని ఒక రకమైన నిర్లిప్తత) కలుగుతుంది.

గురడు వక్ర దృష్టి వలన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.  అష్టమ శని ప్రభావం వల్ల పనులు నెమ్మదిగా జరుగుతాయి. అయితే జూలై 4న శుక్రుడు మీ లగ్నంలోకి రావడం వల్ల ఈ మానసిక ఇబ్బందుల నుంచి నెమ్మదిగా కోలుకుంటారు.

రాశ్యధిపతి సూర్యుడి  బలం వల్ల వ్యక్తిగత జీవితంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. పదోన్నతి లభించే సూచనలున్నాయి. తల్లితండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. కుటుంబ పెద్దల జోక్యంతో తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. 

ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలకు సమయం మరింత అనుకూలంగా ఉంది. ఈ నెల ద్వితీయార్థంలో పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. పిల్లలకు సమయం అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారని పండితులు చెబుతున్నారు. 

అష్టమ శని ప్రభావం తగ్గడానికి ..  కేతువు వల్ల వస్తున్న మానసిక ఒత్తిడి, నిర్లిప్తత తొలగిపోవడానికి ఈ క్రింది పరిహారాలు పాటించండి

 కేతు పరిహారం: మనసులో ఉన్న ఆత్మన్యూనత , భయం తొలగిపోవడానికి ప్రతిరోజూ వినాయకుడికి గరికతో పూజ చేయండి. సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి.

 అష్టమ శని శాంతి: పనుల్లో జాప్యం, ఆరోగ్య సమస్యలు తగ్గడానికి శనివారం నాడు నవగ్రహాల వద్ద నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. వృద్ధులకు ..  వికలాంగులకు .. పేదలకు సహాయం చేయండి.

 దక్షిణామూర్తి ఆరాధన: 12వ ఇంట ఉన్న గురువు విపరీతమైన ఖర్చులు లేకుండా, కేవలం శుభ కార్యాలకే ధనం ఖర్చయ్యేలా ఆశీర్వదించడానికి గురువారం నాడు శివాలయంలో దక్షిణామూర్తికి పసుపు పూలతో అర్చన చేయండి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.