జులై 3న రవీంద్రభారతిలో పంచతంత్ర నృత్య కథలు

జులై 3న  రవీంద్రభారతిలో పంచతంత్ర నృత్య కథలు

రవీంద్రభారతి, వెలుగు: ప్రముఖ నృత్యకారిణి, గురు పద్మశ్రీ డాక్టర్ ఆనంద శంకర్ జయంత్ నేతృత్వంలోని శంకరానంద కళాక్షేత్ర ఆధ్వర్యంలో రూపొందించిన నృత్య నాటిక పంచతంత్ర నృత్య కథలను ఈ నెల 3న సాయంత్రం 6.45 గంటలకు రవీంద్రభారతిలో ప్రదర్శించనున్నారు. భారత ప్రభుత్వ సంస్కృతి మంత్రిత్వ శాఖకు చెందిన అసిస్టెన్స్ టు కల్చరల్ ఆర్గనైజేషన్స్ విత్ నేషనల్ ప్రెజెన్స్ పథకం కింద ఈ కార్యక్రమానికి మద్దతు లభించింది. ఈ ప్రదర్శనకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆనంద శంకర్ జయంత్ ఒక ప్రకటనలో తెలిపారు. 

78 నిమిషాలపాటు సాగే ఈ వినూత్న నృత్య నాటికలో హైదరాబాద్, బెంగళూరుకు చెందిన 20 మందికి పైగా కళాకారులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ నృత్యకారుడు మిథున్ శ్యామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. పంచతంత్ర కథలు నీతి, తాత్విక విలువలను ప్రతిబింబిస్తూ నేటి సమాజానికీ మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలకు 99591  54371, 99639 80259 ఫోన్​నంబర్లలో సంప్రదించాలని సూచించారు.