తోక జాడిస్తే భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బంధం పెంచుకుంటం: పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హెచ్చరించిన పీఓకే ప్రజలు

తోక జాడిస్తే భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బంధం పెంచుకుంటం: పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హెచ్చరించిన పీఓకే ప్రజలు

రావాలాకోట్: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగం కాదని అక్కడి ప్రజలు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమపై ఆంక్షలు కొనసాగిస్తే.. తాము భారత్ సాయం కోరతామని హెచ్చరించారు. పాక్ పరిపాలనలో ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వ పెత్తనానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా నిరసనలు మంగళవారంతో 22వ రోజుకు చేరుకున్నాయి. 

రావాలాకోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఈద్గా మైదానంలో వేలాది మందితో నిర్వహించిన భారీ ప్రదర్శనలో నిరసనకారులు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రాంతం ఇక పాకిస్తాన్ నియంత్రణలో ఉండబోదని, తమను విస్మరిస్తే భారతదేశంతో బలమైన సంబంధాల కోసం ముందడుగు వేస్తామని నేతలు హెచ్చరించారు.

మాకు పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరం లేదు

బహిరంగ సభలో నిరసనలకు సారథ్యం వహిస్తున్న సర్దార్ అమన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎప్పటికీ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగం కాదు. ఈ ప్రాంతంపై ఆధారపడి పాకిస్తాన్ బతుకుతోందే తప్ప, పాకిస్తాన్ వల్ల మాకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు” అని అన్నారు. 

తమకు ఆహారం, నిత్యావసర వస్తువులపై విధించిన ఆంక్షలను తక్షణమే తొలగించకపోతే.. స్థానిక ప్రజలు సహాయం కోసం భారతదేశం వైపు చూస్తారని స్పష్టంచేశారు. ఈ అడుగు పాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తీవ్ర ఒత్తిడిని పెంచుతుందని, ప్రాంతీయ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుందని ఆయన హెచ్చరించారు.

ఎందుకీ నిరసనలు..?

దీర్ఘకాలంగా పేరుకుపోయిన పరిపాలనా లోపాలు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం, పాక్ ప్రభుత్వ అణచివేత ధోరణి, పరిపాలనా నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ప్రజా ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో.. పాక్ అధికారులు ఇంటర్నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆహార సరఫరా, ఇతర నిత్యావసర వస్తువులను దాదాపు రెండు వారాల పాటు నిలిపివేయడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది.
 

మరిన్ని వార్తలు