వీడియో: రాష్ట్రం అల్లకల్లోలం కావాలని అఘోర పూజలు చేస్తారా.? శివమొగ్గ గుడిలో పూజల రహస్యమేంటి.?: సీఎం రేవంత్

వీడియో:  రాష్ట్రం అల్లకల్లోలం కావాలని అఘోర పూజలు చేస్తారా.? శివమొగ్గ గుడిలో పూజల రహస్యమేంటి.?: సీఎం రేవంత్

సంగారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అల్లకల్లోలం జరగాలని అఘోర పూజలు  చేస్తారా? కర్ణాటకలోని శివమొగ్గ గుడికి రహస్యంగా ఎందుకు వెళ్లారో..అక్కడ చేసిన అఘోర పూజల రహస్యమేంటో తేల్చాలన్నారు రేవంత్. ప్రజలపై చేతబడి పూజలు ఏంటి.. ఇంత దుర్మార్గుడు ఎవరైనా ఉంటారా?  ఇలాంటి వాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తారా.? అని ప్రశ్నించారు రేవంత్. ఎల్ నినో వస్తదని శాస్త్రవేత్తలు చెప్పారు.. కానీ అదృష్టవశాత్తు వర్షాలు పడుతున్నాయన్నారు. 

అగ్గిపెట్టే రావు..అఘోర రావు అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు.  హరీశ్,కేటీఆర్ మాయగాళ్లు.. వాళ్ల మాయమాటలు విని మోసపోవద్దన్నారు.  ఉద్యమంలో హరీశ్ రావుకు అగ్గిపెట్టె దొరకలేదని సెటైర్ వేశారు.  రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు తీయడంలో హరీశ్ నంబర్ వన్ అని చెప్పారు.  

ఐదేండ్లు మహిళలకు మంత్రి పదవి ఇవ్వనోడు ఇపుడు మాట్లాడుతున్నాడని..  తాము  వచ్చిన మొదటి ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలిచ్చామని అన్నారు.  ప్రతి ఆరు నెలలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తామని.. ఏ ఖాళీని గాలికి వదిలేయను అన్నీ ఉద్యోగాలు  భర్తీ చేస్తామన్నారు రేవంత్ .