అమెరికాలో హత్యలు తగ్గినట్లు లేటెస్ట్ గణాంకాల ద్వారా వెల్లడైంది. FBI వెల్లడించిన 2025 క్రైమ్ ఫిగర్స్ లో.. హత్యల రేటు 70 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందని వెల్లడైంది. అంటే డెబ్బై ఏళ్ల క్రితం ఎంత తక్కువ హత్యలు నమోదయ్యాయో.. 2025లో కూడా ఆ స్థాయికి పడిపోయినట్లు అర్థం. 1950 నుంచి అమెరికాలో నేరాలు, హత్యల రేట్లు ఇంతలా తగ్గటం ఇదే తొలిసారి అని ఎఫ్బీఐ పేర్కొంది.
హత్యల రేటు తగ్గుదల క్రెడిట్ తనదేనని ట్రంప్ చెప్పుకోవడం ఇక్కడ ఆసక్తిగా మారింది. FBI లేటెస్టు లెక్కల ప్రకారం.. గత ఏడాది హత్యల రేటు 18.1 శాతానికి పడిపోయినట్లు వెల్లడైంది. అంటే ప్రతి లక్ష మందిలో 4.1 హత్యలు జరుగుతున్నట్లు.. అంటే 1956 తర్వాత అంత తక్కువ నమోదు కావడం ఇదే తొలిసారి అని వెల్లడయ్యింది. ఓవరాల్ క్రైమ్ రేట్ కూడా 9.3 శాతానికి తగ్గగా.. దోపిడీలు 18.5 శాతానికి తగ్గిపోయినట్లు లేటెస్ట్ డేటా ద్వారా తెలుస్తోంది.
అమెరికాలో నేరాలు, హత్యల రేటు తగ్గడంపై ప్రసిడెంట్ ట్రంప్ క్రెడిట్ చేసుకున్నారు. 2026 ఆగస్టు 14న న్యూయార్క్ లోని నసావూ కౌంటీ పోలీస్ అకాడమీ సందర్శించిన ట్రంప్.. తన అడ్మినిస్ట్రేషన్.. పాలన కారణంగానే నేరాలు తగ్గాయని.. పబ్లిక్ సేఫ్టీ విషయంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. పోలీసుల సపోర్ట్, క్రైమ్ పైన తమ ప్రభుత్వం కఠిన చర్యల కారణంగా క్రైమ్ రేట్ దిగొచ్చిందని చెప్పారు. తన వల్లే అమెరికాలో క్రైమ్ తగ్గినట్లు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయటం కొంత నవ్వుపాలవుతుండగా.. కొంత మేరకు విమర్శలకు గురవుతోంది.
గణాంకాలు ఇలా ఉన్నాయి..
లేటెస్టు గణాంకాల ప్రకారం.. అమెరికాలో హత్యలు కోవిడ్-19 తర్వాత పెరిగాయి. దానికి భిన్నంగా హత్యల సంఖ్యలో తగ్గినట్లు లేటెస్టు రిపోర్టుద్వారా తెలుస్తోంది.
2020లో హత్యల సంఖ్య ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు పెరుగుతూ పోతూనే ఉంది. అయితే 2022లో హత్యలు తగ్గడం మొదలయ్యాయని.. అమెరికావ్యాప్తంగా నగరాల్లో హత్యలు హింసాత్మక నేరాలు తగ్గడంతో 2024 ,2025లలో ఈ తగ్గుదల మరింత స్పీడ్ గా జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు - ఇలా ఏ పార్టీ అధికారంలో ఉన్న సిటీల్లోనైనా ఈ తగ్గుదల కనిపించింది.
ట్రంప్ క్రెడిట్ పై డిబేట్..
తన వల్లే క్రైమ్ రేట్ తగ్గిందని ట్రంప్ గొప్పలు చెప్పుకుంటుండటంపై పెద్ద డిబేటే మొదలైంది. ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నట్లు ఆయన వల్లే క్రైమ్ తగ్గలేదని.. ఆయన అధికారంలోకి వచ్చేనాటికే క్రైమ్ రేట్ తగ్గినట్లు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ట్రంప్ 2025 జనవరిలో అధికారంలోకి వస్తే.. అంతకు ముందే.. డెమోక్రాట్లు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, నగరాల్లో కూడా క్రైమ్ తగ్గినట్లు చెబుతున్నారు.
దేశ వ్యప్తంగా వచ్చిన తగ్గుదలను.. తన వల్లే అని తన ఖాతాలో వేసుకోవడం మరీ హాస్యాస్పదంగా ఉందని కొట్టిపారేస్తున్నారు.
